Anchor Suma -Rajiv Kanakala: ఎన్నో ప్రయోగాలు చేస్తే.. ఆ వార్తలు ఆగాయి!
ABN , First Publish Date - 2023-07-22T20:50:01+05:30 IST
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారనే వార్త గత రెండేళ్లు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఇద్దరి సంపాదన విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అలాంటిదేమీ లేదని పలు సందర్భాల్లో ఈ జంట చెప్పినా గాసిప్‌లు మాత్రం ఆగలేదు.
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ(Suma), రాజీవ్ కనకాల (Rajiv kanakala) విడాకులు తీసుకుంటున్నారనే వార్త గత రెండేళ్లు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఇద్దరి సంపాదన విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అలాంటిదేమీ లేదని పలు సందర్భాల్లో ఈ జంట చెప్పినా గాసిప్‌లు మాత్రం ఆగలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘సుమ-రాజీవ్ కనకాలకు మధ్య విబేధాలు, విడాకుల వరకూ వెళ్లారు అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా భయపడ్డా. కానీ సుమ మాత్రం అసలు (Rajiv Comments on Divorce) పట్టించుకునేది కాదు. నేనే కాస్త ఆలోచనలో పడేవాణ్ని. ఈ వార్తలు చూసిన ఊళ్లల్లో ఉన్న మా బాబాయ్ వాళ్లు, విదేశాల నుంచి స్నేహితులు ఫోన్ చేసిన అడిగేవారు. మేమైతే బాగానే ఉన్నాం.. మా 23 ఏళ్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంది అంటూ చెప్పేవాళ్లం. అయినా ఏదో ఒక మూల నుంచి ఈ వార్త హింసిస్తూనే ఉండేది. ఆ సమయంలోనే ఓ ఐడియాతో ఇద్దరం కలిసి రీల్స్ చేశాం. సుమ చేసే షోలకు నేనే వెళ్లడం చేశాను. అలాగైనా జనాల్లో వీరు కలిసే ఉన్నారని టాక్ వస్తుందని. ఆ రీల్స్ వల్ల ఆ మచ్చ కాస్త కనుమరుగైంది. ఈ మధ్యనే సుమ అమెరికా వెళ్లి వచ్చింది. తను రాగానే ఇద్దరం ఓ రీల్ చేశాం. అది వైరల్ కావడంతో మేమిద్దరం కలిసే ఉన్నాం అని జనాలకు తెలిసింది. దాదాపు నాలుగేళ్లగా ఇదే రచ్చ. ఈ మధ్యనే కాస్త తగ్గింది. అయితే అసత్య వార్తల వల్ల స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడ్డారు. అదే బాధ కలిగించింది. ఈ విషయంలో నేనే భయపడ్డాను కానీ సుమ చాలా లైట్ తీసుకునేది. తనని చూసి నేను కూడా ఇలాంటివి లెక్కచేయడం మానేశా. మేమిద్దరం మా వ్యక్తిగత. వృత్తి జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాం’’ అని రాజీవ్ చెప్పారు.