Salaar : కటౌట్‌ను కరెక్ట్‌గా వాడుకుంటే చాలు

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:57 PM

ప్రభాస్‌(Prabhas) విషయంలో రాజమౌళి(Rajmouli) చెప్పిందే నిజమైంది. అతని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి 'ప్రభాస్‌ కటౌట్‌ను (Prabhas Cutout)కరెక్ట్‌గా వాడుకుంటే చాలు హిట్‌ కొట్టేయొచ్చు’ అని అంటుంటారు. ఇప్పుడు అదే జరిగింది.

Salaar : కటౌట్‌ను కరెక్ట్‌గా వాడుకుంటే చాలు

ప్రభాస్‌(Prabhas) విషయంలో రాజమౌళి(Rajmouli) చెప్పిందే నిజమైంది. అతని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి 'ప్రభాస్‌ కటౌట్‌ను (Prabhas Cutout)కరెక్ట్‌గా వాడుకుంటే చాలు హిట్‌ కొట్టేయొచ్చు’ అని అంటుంటారు. ఇప్పుడు అదే జరిగింది. స్టార్‌ హీరో సినిమాలంటే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, వీరోచితమైన పోరాటాలు, పాటలు తప్పనిసరి. ఇందులో అన్ని ఉన్నాయి కానీ ప్రభాస్‌కు డైలాగ్స్‌ తక్కువ రాశాడు దర్శకుడు. ఉన్నవి కొన్ని డైలాగులే అయినా అవన్నీ ప్రేక్షకులను మెప్పించే పవర్‌ఫుల్‌ డైలాగులే! అవి ఆకట్టుకునేలా ఉండడంతో 'మాటలు పెద్దగా లేవు' అన్న యాంగిల్‌లో ఆలోచించలేదు. ఇక దర్శకుడు తన టేకింగ్‌తోపాటు ప్రభాస్‌ కటౌట్‌ను కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులకు కావలసింది సినిమాలో ఉండటంతో హిట్‌ చేసేశారు. రాజమౌళి చెప్పినట్లు ప్రశాంత్ నీల్‌ ప్రేక్షకుల నాడి పట్టి, ప్రభాస్‌ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారో అదే చేశాడు. దాని ఫలితమే ఈ సినిమా సక్సెస్‌.

ఇక సినిమా విడుదలకు ముందు, తర్వాత  ఫాన్స్ హంగామాకు అంతే లేదు. 'బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చిన 'రాధేశ్యాం', 'ఆదిపురుష్‌'చిత్రాలు తీవ్రంగా నిరుత్సాహపరచడంతో అభిమానులు ఈ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నారు. పలుమార్లు వాయిదాల తర్వాత భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా సూపర్‌ హిట్‌ అని చెబుతున్నారు. కొందరు యావరేజ్‌ అని అంటున్నా.. మెజారిటీ మాత్రం హిట్‌ టాక్‌ నడుస్తోంది. సోషల్‌ మీడియాలో కూడా పాజిటివ్‌ టాక్‌ కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్‌ టేకింగ్‌కు ఫాన్స్  ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. రెండు ఫ్లాప్‌ సినిమాల తర్వాత వచ్చిన హిట్‌ కావడంతో థియేటర్ల వద్ద ఫాన్స్  కోలాహలం మామూలుగా లేదు. విడుదలకు ముందు, తర్వాత కూడా అదే సందడి. పలు థియేటర్ల దగ్గర కేరళ వాయిద్యాలతో థియేటర్ల ముందు పండగ వాతావరణాన్ని తలపించారు. టపాసులు కాల్చుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ‘కేజీఎఫ్‌’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడం, ప్రభాస్‌ పోస్టర్లు ఆకట్టుకోవడం ప్లస్‌ అయ్యాయి. ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సినిమా సక్సెస్‌తో అభిమానులు ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 02:46 PM