Oscars95: సూత్రధారులు ఈ ముగ్గురే

ABN , First Publish Date - 2023-03-13T09:34:53+05:30 IST

తెర వెనక కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ లాంటి వాళ్ళు ఈ 'నాటు నాటు' పాటకి పనిచేస్తే, తెర ముందు ఈ ముగ్గురూ ఈ పాటని ఆస్కార్ లో అవార్డు గెలిపించేందుకు కష్టపడ్డారు

Oscars95: సూత్రధారులు ఈ ముగ్గురే

తెలుగు జయకేతనం ఆస్కార్ అవార్డుల్లో (Oscars95) ఎగిరింది. 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలోని 'నాటు నాటు' (NaatuNaatu) పాటకు గాను ఆస్కార్ అవార్డు లభించింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్ (Chanrabose) ఇద్దరూ ఆస్కార్ వేదికమీదకి వెళ్లి ఈ అవార్డు అందుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది. మరి వాళ్లిద్దరూ అందుకోవటానికి వెళ్లడం ఏంటి, రాజమౌళి (SS Rajamouli) ఎందుకు వెళ్ళలేదు అని.

ఎందుకంటే, ఆ పాటని రాసింది, దానికి సంగీతం సమకూర్చింది వాళ్లిద్దరే కాబట్టి. ఇంకా ఆ పాటని కోరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) కి కూడా అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అతనే కదా ఆ పాటని ఆలా రావటానికి తన శక్తి అంతా దారబోసే చేసాడు. వీళ్ళందరూ తెర వెనక పని చేస్తే, తెర ముందు పనిచేసిన వాళ్ళు కూడా వున్నారు.

rajamouliramacharanntr.jpg

ఈ పాటని జనాల్లోకి తీసుకు వెళ్ళింది ఆ పాటకి డాన్స్ చేసిన ఆ సినిమాలో వేసిన కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan). అదీ కాకుండా, అమెరికా వెళ్లి ఈ పాటని మరింతగా ప్రజాదరణ పొందటానికి చేసింది కూడా వాళ్లిద్దరే. అలాగే వాళ్ళతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా. ఈ ముగ్గురూ అమెరికా వెళ్లి చాలా కష్టపడ్డారు. తెర వెనకాల ఆ ముగ్గురూ కష్టపడితే, ఆ పాటని ఆస్కార్ నామినేషన్ లోకి తీసుకురావటానికి, ఆ తరువాత ఆ పాటకి అవార్డు రావటానికి ఈ ముగ్గురూ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కష్టపడ్డారు.

ఈ ముగ్గురూ అమెరికా లో అక్కడి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, సందడి చేస్తూ, అభిమానులకి పోజు లు ఇస్తూ, సెల్ఫీ ఫోటోలు దిగుతూ, ఈ సినిమాని ఎక్కడికి తీసుకు వెళ్లాలో అంత ఎత్తుకు తీసుకు వెళ్లారు. వీళ్ళు చేసిన కృషి కూడా మరవలేనిది.

Updated Date - 2023-03-13T09:34:54+05:30 IST