SS Rajamouli: ఆనంద్ మహీంద్రా.. సంభాషణ ఆసక్తికరం!
ABN , First Publish Date - 2023-04-30T15:29:29+05:30 IST
‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సోషల్ మీడియలో ఆయన గురించి వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసిస్తుంటారు.
‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సోషల్ మీడియలో ఆయన గురించి వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసిస్తుంటారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్ర (Anand mahindra) ట్విట్టర్ వేదికగా రాజమౌళితో మాట్లాడారు. ఆ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సింధూ నాగరికతపై సినిమా తీయాలని కోరుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ మేరకు సింధూ నాగరికతకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
‘‘ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయి. ప్రతిభను ప్రతిబింబిస్తాయి. నాటి పరిస్థితుల ప్రపంచానికి తెలిసేలా వీటిపై ఒక సినిమా తీయగలరా..?’’ అని ట్వీట్ చేశారు. దీనికి రాజమౌళిని ట్యాగ్ చేశారు. ఆయన ట్వీట్‌కు రాజమౌళి రిప్లై ఇచ్చారు. మగధీర’ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ‘‘మగధీర షూటింగ్‌ను ధోలావీరాలో చేశాం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ చెట్టు నన్ను ఎంతోగానో ఆకట్టుకుంది. దాన్ని ఆధారంగా సింధూ నాగరికత ఎలా అభివృద్థి చెందింది? ఎలా అంతరించింది అని సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఓసారి పాకిస్థాన్ వెళ్లాను. అక్కడ మొహెంజోదారొకు వెళ్లి రీసెర్చ్ చేయాలని ప్రయత్నించా. కానీ, నాకు అనుమతి దక్కలేదు’’ అంటూ బాధతో కూడిన ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆనంద్ మహీంద్రాకు సపోర్ట్‌గా దీనిపై సినిమా తీయాలని రాజమౌళిని కోరారు.
అయితే రాజమౌళి మెదడులో ఓ ఆలోచన వచ్చి, రీసెర్ట్ వరకూ వెళ్లారంటే.. కాస్త టైమ్ తీసుకున్నా అది కార్యరూపం దాల్చక తప్పదు. దీన్ని బట్టి భవిష్యత్తులో సింధూ నాగరికతతో (Sindhu Naagarikatha) సినిమాను ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు.