Rahul Ramakrishna: ముద్దుల బిడ్డను పరిచయం చేశాడు!
ABN , First Publish Date - 2023-04-25T15:47:07+05:30 IST
హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ తన కుమారుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు.
హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తన కుమారుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆయన ఓ రోజున ‘మై బెటర్ హాఫ్’ అంటూ భార్యకు ముద్దుపెడుతున్న ఫొటో షేర్ చేసిన షాకిచ్చాడు. ఆ ఫొటో చూసి ‘రాహుల్‌కి పెళ్లి ఎప్పుడు అయింది’ అని ఆశ్చర్యానికి లోనయ్యారు నెటిజన్స్. తను తండ్రి కాబోతున్నట్లు గత ఏడాది నవంబర్‌లో ప్రకటించాడు. ఈ ఏడాది సంక్రాంతికి రాహుల్ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కానీ అతని కొడుకు ఫోటోని మాత్రం చూపించలేదు. ఇన్నాళ్లకు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కొడుకు పేరు రూమి (RUmi) అని చెబుతూ.. ఓ ఫోటోని ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోలో బిడ్డతోపాటు రాహుల్ భార్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. రూమిని.. జూనియర్ రాహుల్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రూమి అంటే అర్థం ఏంటి? అని అభిమానులు రాహుల్‌ని అడుగుతున్నారు.
హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు మంచి కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. హాస్య నటుడిగా రాణిస్తూనే శ్రీమంతుడు, జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.