Raghava Lawrence : అన్నయ్యా.. అనగానే ఆల్ ద బెస్ట్ అన్నారు.
ABN , First Publish Date - 2023-09-25T14:55:34+05:30 IST
‘చంద్రముఖి -2’ సినిమా చేయడానికి కారణమైన రజనీకాంత్‌గారికి రుణపడి ఉంటా. తెలుగు గడ్డపై ఇంతమంది అభిమానులను సొంత చేసుకోవడానికి కారణం చిరంజీవిగారు. ఆయన్ను, నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను’’ అని రాఘవ లారెన్స్ అన్నారు.
‘చంద్రముఖి -2’ (Chandrmukhi2) సినిమా చేయడానికి కారణమైన రజనీకాంత్‌గారికి రుణపడి ఉంటా. తెలుగు గడ్డపై ఇంతమంది అభిమానులను సొంత చేసుకోవడానికి కారణం చిరంజీవిగారు. ఆయన్ను, నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను’’ అని రాఘవ లారెన్స్ అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చంద్రముఖి-2’. పి.వాసు దర్శకుడు. రజనీకాంత్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో కంగనా రనౌత్ రాజనర్తకిగా నటించారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ.. ‘‘రెబల్’ తర్వాత తెలుగులో సినిమాను డైరెక్ట్ చేయడం కుదర్లేదు. ‘చంద్రముఖి 2’ ద్వారా మిమ్మల్ని ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. మా నుంచి ఏమీ ఆశించకుండా మీ సొంత డబ్బుతో టికెట్ కొని సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు చూపించ ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను. మీ ప్రేమలోనే దేవుణ్ని చూస్తున్నా. నా కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేసిన హీరోలందరి ఫ్యాన్స్ నాకు అభిమానులుగా మారారు.
ఇక ‘చంద్రముఖి -2’ సినిమా విషయానికొస్తే.. ముందుగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నటించిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో నేను భాగం కావడం అదృష్టమనే చెప్పాలి. దర్శకుడు పి.వాసు కథ చెప్పగానే రజనీకాంత్‌గారికి ఫోన్ చేశాను. ‘అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా’ అని చెప్పగానే ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాణ్ని కాదు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకున్నానంటే చిరంజీవి మరో కారణం. ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే ఎం.ఎం. కీరవాణికి ‘ఆస్కార్’ అవార్డు వచ్చింది. మేమంతా ఎంతో సంతోషించాం. ఈ సినిమా కూడా ఆస్కార్ స్థాయికి చేరుకోవాలని దేవుణ్ని కోరుకుంటున్నా’’ అని అన్నారు.