Allu Arjun: ఆ రోజున పుష్పరాజ్‌ ఇవ్వబోతున్న ట్రీట్‌ ఇదే!

ABN , First Publish Date - 2023-03-20T13:14:17+05:30 IST

‘పుష్ప-2’ చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరైన అప్‌డేట్‌ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun: ఆ రోజున పుష్పరాజ్‌ ఇవ్వబోతున్న ట్రీట్‌ ఇదే!

‘పుష్ప-2’ (Pushpa2) చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరైన అప్‌డేట్‌ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైజాగ్‌లో జరిగిన షెడ్యూల్‌ వార్త బయటకు వచ్చింది కానీ అంతకు మించి ఏమి చెప్పలేదు. అభిమానులు నిరాశ చెందుతున్న ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. బన్నీ(allu arjun) ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వబోతున్నారట. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది పుష్ప-2 (Pushpa 2) టీమ్‌. మూడు నిమిషాల యాక్షన్‌ కట్‌ టీజర్‌ను (3 minutes teaser on bunny birthday) ఏప్రిల్‌ 8న విడుదల చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ టీజర్‌కు సంబంధించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం నుంచి సమాచారం. మూడు నిమిషాల నిడివి గల టీజర్‌లో అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలు దర్శనమివ్వబోతున్నాయట. అయితే బన్నీ పుట్టినరోజున అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. (Surprise for Fans)

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పుష్ప ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించడంతో ‘పుష్ప-2’ అంతకుమించి ఉండేలా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-03-20T13:15:53+05:30 IST