Pushpa 2: మరోసారి ట్రెండింగ్‌లో.. కారణం ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-03-08T15:05:38+05:30 IST
‘పుష్ప ది రైజ్ (Pushpa The Rise) సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (allu arjun). ‘పుష్ప -2’(Pushpa 2)తో మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

‘పుష్ప ది రైజ్ (Pushpa The Rise) సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (allu arjun). ‘పుష్ప -2’(Pushpa 2)తో మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటి పార్ట్ సాధించిన విజయంతో రెండో పార్ట్ అంతకు మించి ఉండేలా తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నారు. దాంతో స్ర్కిప్ట్‌ను మరింత మెరుగు చేసి సెట్స్ మీదకెళ్లడానికి కాస్త సమయం పట్టింది. ఇటీవల వైజాగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే సినిమాకు సంబంధించి సరైన అప్‌డేట్ ఇవ్వడం లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో గీతా ఆర్ట్స్ (Geetha arts) కార్యాలయం ఎదురుగా అభిమానులు నిరసన కూడా వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాకపోయినా మరోసారి ‘పుష్ప-2’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అందుకు కారణం.. హీరోయిన్ సాయిపల్లవి. హైబ్రీడ్ పిల్ల ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేయబోతోందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అది నిజమేనని, పది రోజులు కాల్ షీట్ కూడా ఇచ్చిందని ఇప్పుడు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు కానీ సాయిపల్లవి ఈ చిత్రంలో ఓ పాత్ర చేయడం ఖాయమైందనే బలంగా వినిపిస్తోంది. దీనితో ‘పుష్ప-2’ చిత్రానికి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. సినిమాపై మరింత క్రేజ్ పెంచడానికి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ సిద్ధం చేస్తున్నారట సుకుమార్. ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టిన రోజున ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్‌తోపాటు ఓ గ్లిమ్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. #Pushpa2
రష్మిక మందన్నా (rashmika mandanna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రావు రమేశ్, ఫవాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.