Allu Arjun: అంచనాలు మించేలా ‘పుష్ప-2’ సన్నివేశాలు!
ABN , First Publish Date - 2023-06-29T11:08:35+05:30 IST
ఈ కాలు నాదే.. ఈ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు ఏసుకుంటిని... మీ ఓనర్ మీద యేశానా ఏంది? ‘పుష్ప’ చిత్రంలో ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ సన్నివేశంలో అల్లు అర్జున్ మేనిరిజం, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ అంతే ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఆ సీన్‌కు మించి ఆకట్టుకునే సన్నివేశాలు ‘పుష్ప-2’ కోసం తెరకెక్కిస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్.

"ఈ కాలు నాదే.. ఈ కాలు నాదే..
నా కాలు మీద నా కాలు ఏసుకుంటిని...
మీ ఓనర్ మీద యేశానా ఏంది?"
‘పుష్ప’ చిత్రంలో ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. (Pushpa)
ఆ సన్నివేశంలో అల్లు అర్జున్ మేనిరిజం, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ అంతే ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఆ సీన్‌కు మించి ఆకట్టుకునే సన్నివేశాలు ‘పుష్ప-2’ (Pushpa2) కోసం తెరకెక్కిస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ఇటీవల వైజాగ్‌లో తెరకెక్కించిన సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.
వంద అడుగుల ఎత్తులో...
ఇటీవల వైజాగ్ పోర్ట్‌లో జరిగిన షూటింగ్‌లో అల్లు అర్జున్‌పై (Allu arjun)భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. దీని కోసం జర్మనీ నుంచి 50 మంది స్టంట్ ఆర్టిస్ట్‌లను దింపారు. ప్రతినాయకుడి బృందం పుష్పరాజ్‌పై తిరగబడే (action scenes) సన్నివేశాలను భారీగా రూపొందించారు. పోర్ట్‌లో భారీ క్రేన్ సాయంతో వంద అడుగులు ఎత్తులో తల కిందులుగా అల్లు అర్జున్‌ని వేలాడదీసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. జర్మనీ నుంచి వచ్చిన 50 మంది ఫైటర్స్ ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. ఇక్కడో మరో ఆసక్తికర విషయం ఉంది. వంద అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడదీసిన పుష్పరాజ్ అక్కడ కూడా తన మేనరిజాన్ని వదల్లేదు. అంత ఎత్తులో కూడా ‘ఈ కాలు నాదే.. ఈ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు ఏసుకుంటిని’ అన్నట్లు గాల్లో కూడా కాలు మీద కాలు వేసుకుని వేలాడుతున్నాడు. చిత్ర బృందం అంతా ఇప్పుడు ఈ సన్నివేశం గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఒక కాలు మడిచి ఉండగా మరో కాలికి తాడు కట్టి వేలాడదీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. బన్నీ ఇలాంటి రిస్క్ షాట్‌లకు కూడా వెనకాడకుండా, డూప్ లేకుండా చేశాడని చిత్ర బృందం చెబుతోంది. సినిమా ఈ సీన్ సూపర్‌గా పేలుతుందని చెబుతున్నారు.
పార్టీ ఉంది పుష్ప!
పుష్ఫ చిత్రంలో మరో ఫేమస్ డైలాగ్ ‘పార్టీ లేదా పుష్ప’? ఇది ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. పుష్ప రాజ్ పార్టీ ఇచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు ఆ సన్నివేశాలనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రగతి రీసార్ట్‌లో పార్టీ అట్మాస్పియర్ క్రియేట్ అయ్యేలా ఓ పెద్ద సెట్ వేశారు. అక్కడ పుష్పరాజ్ పార్టీ ఇచ్చే సన్నివేశాలను తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. అదే రోజు గాలులతో కూడా భారీ వర్షం రావడంతో పార్టీ సెట్ మొత్తం ధ్వంసం అయింది. దాంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం నైట్‌లైట్‌లో ఆ సన్నివేశాలు తెరకెక్కించే పనిలో ‘పుష్ప-2’ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాఽధించిందో తెలిసిందే! తదుపరి ప్రకటించిన ‘పుష్ప-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంతకుమించి ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.