Punch Prasad: ఆపరేషన్‌కు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో.. సాయం కోరుతూ..
ABN , First Publish Date - 2023-06-03T17:37:17+05:30 IST
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కిడ్నీ ఇవ్వడానికి భార్య సిద్ధంగా ఉన్పా.. ఆపరేషన్ ఖర్చులకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో సాయం చేయమని కోరుతున్నారు.
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ (Punch Prasad) కిడ్నీ సమస్యతో (kidney transplantation) ఇబ్బందిపడుతోన్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుని కాస్త ఓపిక ఉన్న రోజుల్లో జబర్దస్ట్ షూటింగ్‌కు వెళ్లి జీవితం సాగిస్తున్నారు. ఆయనకు భార్య సునీత (Sunitha), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి బాఽధ్యత మొత్తం ప్రసాదే చూసుకుంటారు. భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం భార్య సునీతే కిడ్నీ ఇవ్వడానికి ముందకొచ్చింది. దానికి సంబంధించిన పరీక్షలు అన్ని పూర్తయ్యాయి. భార్య కిడ్నీ ప్రసాద్ మ్యాచ్ అవుతుందని కూడా డాక్టర్లు ఇప్పటికే చెప్పారని ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో ప్రసాద్ వెల్లడించారు. అయితే తమ పిల్లలు కాస్త ఎదిగే వరకూ వేచి చూస్తున్నామని ప్రసాద్ దంపతులు ఓసందర్భంలో చెప్పారు. ఇప్పుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కిడ్నీ ఇవ్వడానికి భార్య సిద్ధంగా ఉన్పా.. ఆపరేషన్ ఖర్చులకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో సాయం చేయమని కోరుతున్నారు. ఈ మేరకు జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు సాయం అరిఽ్ధస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో ప్రసాద్ భార్య సునీత కూడా ఉన్నారు.
‘‘మూడేళ్ల మూడేళ్ల క్రితం ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోయాయి. (Punch prasad Need help) అప్పటి నుంచి డయాలసిస్ మీదే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తప్పనిసరిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సిందేనని వైద్యులు సూచించారు. కిడ్నీ మార్పిడి అనేది లక్షలతో కూడుకున్న పని. దయ చేసి ప్రసాద్‌ను గట్టెక్కించడానికి అందరూ సాయం చేయండి. జబర్దస్ట్ టీమ్ నుంచి మేమంతా కొంత మొత్తం ఇప్పటికే పక్కన పెట్టా. వీక్షకులు, జబర్దస్త్ అభిమానులు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను’’ అని నూకరాజు వీడియోలో పేర్కొన్నారు. ఆ పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు