Adipursh: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ పర్వదినం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్!?
ABN , First Publish Date - 2023-03-21T13:39:00+05:30 IST
ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.

ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌కి భారీ ఆశలు ఉన్నాయి. ఎందుకంటే.. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో ‘రాధేశ్యామ్’ అయితే మరీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అందుకే ‘ఆదిపురుష్’తో హిట్ కొట్టాలని ప్రభాస్ కసిగా ఉన్నాడు.
నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని మూవీ టీం భావించింది. దాని కోసం కొన్ని నెలల ముందే భారీ స్థాయిలో టీజర్‌ని విడుదల చేశారు. అయితే.. అందులోని వీఎఫ్‌ఎక్స్‌తోపాటు వానరులు, రావణుడి గెటప్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రావణుడి గెటప్‌తో సైఫ్ అలీఖాన్ తాలిబన్‌లా ఉన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో చిత్ర విడుదలపై వెనక్కి తగ్గిన మూవీ టీం దిద్దుబాటు చర్యలకు దిగింది. అనంతరం ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
అయితే.. రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా.. ఈ మూవీ ప్రమోషన్స్‌ని మూవీ టీం ప్రారంభించలేదు. దీంతో ‘మెలుకో ఓం రౌత్.. #StartAdipurushpromotions’ ని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. తాజాగా వారికి నచ్చే విషయం ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌ని ప్రారంభించేందుకు ఓం రౌత్ అండ్ టీం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి వారి టీం నుంచి ఒకరు మాట్లాడిన్నట్లు సమాచారం.
ఆ వ్యక్తి ప్రకారం.. ‘‘చెడుపై మంచి సాధించిన విజయమే ‘ఆదిపురుష్’. ఇది భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. అలాంటి చిత్ర ప్రచార కార్యక్రమాలని ప్రారంభించడానికి రామనవమి (Rama Navami) కంటే మంచి రోజు ఏముంటుంది?. ప్రభాస్ నేతృత్వంలోని ఓ బృందం దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ఎలాగైనా మార్చి 30న ప్రమోషన్స్‌ని ప్రారంభించేందుకు టీమ్ కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. అలాగే.. విడుదల తేదీకి కొన్ని రోజుల ముందు అంటే మే నెలలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా.. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీతా దేవిగా కృతి సనన్(Kriti Sanon), లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా
Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..
Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?
Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..
LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’
#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్
Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ