Project K: టైర్ విలువ రూ.70కోట్లు!

ABN , First Publish Date - 2023-01-04T15:27:45+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Project K: టైర్ విలువ రూ.70కోట్లు!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. స్క్రిఫ్ట్ పరంగా, ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఈ చిత్రం సరికొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అందువల్లే సినిమాను తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుందంటున్నారు. న్యూ ఇయార్ సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘రీ ఇన్వెంటింగ్ వీల్’ అని టైటిల్ పెట్టి టైర్‌ను రూపొందించడానికి పడిన కష్టాన్ని అందులో చూపించారు. టైర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగానే సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ట్రేడ్ వర్గాల్లోను మంచి బజ్ ఏర్పడింది. ఇటీవలే నైజాం రైట్స్ అమ్ముడయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

నైజాం రైట్స్‌ను ఏషియన్ సునీల్ నారంగ్ సిండికేట్ రూ.70కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఒక సినిమాకు లభించిన అత్యధిక ధర ఇదే కావడం గమనార్హం. ఈ అప్‌డేట్ బయటకు రావడంతోనే ప్రభాస్ అభిమానులందరు టైర్ విలువ రూ.70కోట్లు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ‘ప్రాజెక్ట్ కె’ విషయానికి వస్తే.. ఈ సినిమా భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఐదు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ఈ సీన్స్‌ను హాలీవుడ్‌కు చెందిన యాక్షన్ నిపుణులు కొరియోగ్రాఫ్ చేయనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా చిత్రంలో ఉంటాయని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అశ్వత్థామ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని అమితాబ్ పాత్రను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఒక్క యాక్షన్ సన్నివేశాన్ని బిగ్‌బీపై కూడా చిత్రీకరించారని సమాచారం. ఈ మూవీలో దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘ప్రాజెక్ట కె’ కొనసాగనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2023 మొదటి అర్ధభాగంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

Updated Date - 2023-01-04T15:27:47+05:30 IST