Adipurush: తెలుగు హక్కులు ఎందుకు కొన్నారో వివరించిన నిర్మాత

ABN , First Publish Date - 2023-06-13T15:05:54+05:30 IST

'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. ఓం రౌత్ దీనికి దర్శకుడు. ఈ సినిమా తెలుగు హక్కులు నిర్మాత విశ్వప్రసాద్ రూ165 కోట్లకు కొన్నట్లుగా ప్రకటించారు. అయితే అది ఎందుకు తీసుకున్నారో వివరించారు.

Adipurush: తెలుగు హక్కులు ఎందుకు కొన్నారో వివరించిన నిర్మాత
Adipurush

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) నటించిన 'ఆదిపురుష్' (Adipurush) సినిమా ఈ శుక్రవారం #AdipurushOnJune16 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ (OmRaut) దీనికి దర్శకుడు. ఈ సినిమాకి హైప్ ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చింది. అలాగే ఈ సినిమా వ్యాపారం కూడా బాగా జరిగింది అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ #PeoplesMediaFactory సంస్థ రూ 165 కోట్ల (Rs 165 Crore) రూపాయలకు తీసుకుందని ఆ సంస్థ యజమాని, నిర్మాత టిజి విశ్వప్రసాద్ (TGViswaPrasad) చెప్పారు.

Adipurush1.jpg

విశ్వప్రసాద్ తీసుకోవటం వలన, ఆ డబ్బులు ప్రభాస్ సొంత సంస్థ అయిన యూవి క్రియేషన్స్ (UVCreations) అప్పులు తీర్చడానికి ఉపయోగపడింది అని ఒక వార్త నడిచింది. ఎందుకంటే ఈ సినిమాకి యూవి క్రియేషన్స్ నిర్మాతల్లో భాగం అయినప్పుడు వారు స్వంతంగా విడుదల చేసుకోవచ్చు కదా, మరి విశ్వప్రసాద్ ఎందుకు కొన్నారు అని సందేహం వచ్చింది. వాళ్ళ అప్పులు తీర్చడానికే అనే వార్త బాగా హల్ చల్ చేసింది. అయితే దాన్ని విశ్వప్రసాద్ ఖండించారు. ప్రభాస్ చెప్పడం వలన ఇలా కొనలేదని చెప్పారు. అయితే కొనే ముందు ప్రభాస్ తో చర్చించినట్టుగా మాత్రం చెప్పారు.

adipurush2.jpg

ప్రభాస్ తో వున్న మంచి సంబంధాలు కారణంగా మాత్రమే 'ఆదిపురుష్' #Adipurush హక్కులు తీసుకున్నామని చెప్పారు. ఈ సినిమాకి చాలా క్రేజ్ ఉందని, అందుకే ఈ సినిమా హక్కులు తీసుకున్నామని అంతే గానీ దాని వెనక ఇంకెటువంటి రహస్యాలు లేవని చెప్పారు. అలాగే సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga), ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న హిందీ సినిమా 'స్పిరిట్' (Spirit) తెలుగు హక్కులు కూడా తీసుకుంటామని చెప్పారు విశ్వప్రసాద్. ఇది టి సిరీస్ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2023-06-13T15:05:54+05:30 IST