Kotabommali Police Station: ప్రచారాలు మొదలెట్టిన నిర్మాత బన్నీ వాసు

ABN , First Publish Date - 2023-09-08T14:59:54+05:30 IST

అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించిన 'గీత ఆర్ట్స్ 2' ఇప్పుడు 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్, తేజ మార్ని దర్శకుడు. ఈ సినిమా ప్రచారాలు సెప్టెంబర్ 11 పాటతో మొదలెడుతున్నారు

Kotabommali Police Station: ప్రచారాలు మొదలెట్టిన నిర్మాత బన్నీ వాసు
The poster of Kota Bommali Police Station

గీతా ఆర్ట్స్ 2 (GeethaArts2) సంస్థ అనేక విజయవంతమైన సినిమాలు 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' #GeethaGovindam, 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటివి నిర్మించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయినా 'నాయాట్టు' #Nayattu అనే సినిమాని తెలుగులో 'కోట బొమ్మాళి పిఎస్' #KotabommaliPS పేరుతో రీమేక్ తీసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్ (BunnyVasu), విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.

ఈ తెలుగు రీమేక్ లో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక (SrikanthMeka) ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ (VaralaskhmiSarathKumar) ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అలాగే రాహుల్ విజయ్ (RahulVijay), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar) లు కూడా రెండు కీలక పాత్రల్లో కనపడనున్నారని తెలిసింది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆమధ్య విడుదల చేశారు, అది కొంచెం ఆసక్తిని పెంచింది. అయితే ఈ ప్రచారాలని కొంచెం ఎక్కువ చెయ్యాలని తలచి, ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించారు.

kotabommalips4.jpg

అందుకోసమని ఒక ప్రత్యేక పాటని ఈ సినిమా నుండి ఈ నెల అంటే సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారని ప్రకటించారు. అయితే ఈ పాట శ్రీకాకుళం యాసలో వుండే ఒక ఆసక్తికర పాట అని, పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో వస్తున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెపుతున్నారు దర్శకర్మాతలు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని (TejaMarni) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-09-08T14:59:54+05:30 IST