Priyamani: నాగ చైతన్య సినిమాలో చీఫ్ మినిస్టర్ గా
ABN , First Publish Date - 2023-02-17T16:49:50+05:30 IST
ఇంతకీ ప్రియమణి చేస్తున్న పాత్ర చాలా బలమయినది అని అన్నారు కానీ, ఏంటి అన్నది బయటకి రాలేదు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ప్రియమణి ఒక ముఖ్యమంత్రి (Chief Minister role) పాత్ర లో కనపడనుండి అని తెలిసింది.
నాగ చైతన్య (Naga Chaitanya) మొదటి సారిగా ఒక తెలుగు, తమిళ్ (Bilingual) సినిమా చేస్తున్నాడు, అదే 'కస్టడీ' (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దీనికి దర్శకుడు. ఈ సినిమా చాలా శాతం షూటింగ్ అయిపొయింది కానీ ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి వుంది. ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) కథానాయకురాలు కాగా, ప్రియమణి (Priyamani) ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళ నటుడు అరవింద స్వామి (Aravinda Swamy) కూడా ఇందులో ఒక ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. ఇంతకీ ప్రియమణి చేస్తున్న పాత్ర చాలా బలమయినది అని అన్నారు కానీ, ఏంటి అన్నది బయటకి రాలేదు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ప్రియమణి ఒక ముఖ్యమంత్రి (Chief Minister role) పాత్ర లో కనపడనుండి అని తెలిసింది.
ఈ ముఖ్యమంత్రి పాత్ర సినిమాకి చాల కీలకం అని కూడా తెలిసింది. ఈ పాత్రకి ముందు ఎందరినో అనుకున్న చివరికి ప్రియమణి అయితేనే కరెక్టు అని ఆమెకి ఈ కథ చెప్పారని తెలిసింది. మొదట్లో ప్రియమణి చిన్న పాత్ర అని చెయ్యొద్దు అనుకున్నా, నిర్మాత చిట్టూరి శ్రీనివాస్, దర్శకుడు వెంకట్ ప్రభు ఆమెని వొప్పించారని తెలిసింది. రేపటి నుండి అంటే శనివారం ఆమె సెట్ లోకి అడుగు పెడుతోంది అని కూడా అంటున్నారు. ఆమె షూటింగ్ ఒక వారం పాటు ఉంటుందని తెలిసింది. కస్టడీ లో నాగ చైతన్య ఒక ఇంటెన్స్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలిసింది. ఈమధ్యనే నాగ చైతన్య, కృతి శెట్టి ల మీద అన్నపూర్ణ స్టూడియో లో ఒక పాట కూడా చిత్రీకరించారు.