Hanuman: హను-మాన్ వాయిదా, ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-05-09T09:11:42+05:30 IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్న ఫాంటసీ మూవీ 'హను-మాన్' సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇంతకీ ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అంటే...

Hanuman: హను-మాన్ వాయిదా, ఎందుకంటే...

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'హను-మాన్‌' (Hanu-Man). చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో తేజ సజ్జా (TejaSajja) కథానాయకుడిగా నటించాడు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదల అయింది, చాలా బాగుంది అని ప్రసంశలు కూడా వచ్చాయి. ప్రశాంత్ వర్మ టాలెంట్ వున్న యువ దర్శకుల్లో ఒకడు, అందువల్ల ఈ టీజర్ చూసి సినిమా కూడా విజుయల్ గా బాగుంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా మే 12 న విడుదల చేస్తున్నాం అని చిత్ర నిర్వాహకులు మొదట ప్రకటించారు, కానీ ఇప్పుడు ఆ విడుదల తేదీని వాయిదా వేశారు.

hanuman.jpg

దానికి ఒక బలమైన కారణం వుంది. ఎందుకంటే ఈ సినిమాకి హ్యూజ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ వుంది, అది ఇంకా టైం పెట్టె అవకాశం వుంది, అందుకనే ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం. తొందర తొందరగా చేసేసి అనుకున్న టైం కి విడుదల చేసేకన్నా, సినిమా బాగా వచ్చాక అవసరం అయితే ఎంత టైం కావాలన్నా తీసుకొని విడుదల చెయ్యడం మంచిది అని మేకర్స్ అనుకోవటం వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఇందులో స్వామి హనుమ మీద తీసిన విజుయల్స్ టీజర్ లో అదిరాయి అని అందరూ అన్నారు.

అందుకనే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమా ని వాయిదా వేశారు. ఇందులో వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాల తో సమానంగా ఉంటుంది అని టీజర్‌ చూసినప్పుడే అనుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా నిర్వాహకులు ఆర్ట్‌వర్క్‌ తో కూడిన హనుమాన్ చాలీసా ని కూడా విడుదల చేశారు, దానికి కూడా మంచి స్పందన వచ్చింది.

ఒక టైం లో టీజర్ చూసాక దర్శకుడు, నిర్మాతల మీద బాగా ఒత్తిడి పెరిగింది ఎందుకంటే టీజర్ స్వామి హనుమ విజుయల్స్ అలాగే ఆ టీజర్ అవన్నీ చూసాక, సినిమాలో ఇంకెలా వుండబోతున్నాయనే భావం వస్తుంది. అందుకని అవన్నీ చెయ్యడానికి దర్శకుడు మరికొంత సమయం పడుతుందని భావించి సీనియా విడుదల వాయిదా వేసినట్టుగా తెలిసింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేదే త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపారు. "హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తామని మాటిస్తున్నాం. బిగ్ స్క్రీన్ పై ‘హనుమాన్‌’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం,’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ 'హను-మాన్' తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.

Updated Date - 2023-05-09T09:11:42+05:30 IST