Prashanth Varma: ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వెనక్కి తగ్గేవాడిని! 

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:41 PM

సంక్రాంతి సినిమాల మధ్య ఉన్న పోటీ గురించి దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prashanth varma) ఆసక్తికర వ్యాఖ్య్యలు చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘హనుమాన్‌’ (hanuman)రిలీజ్‌ విషయంలో వెనక్కి తగ్గకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.

Prashanth Varma:  ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వెనక్కి తగ్గేవాడిని! 

సంక్రాంతి సినిమాల మధ్య ఉన్న పోటీ గురించి దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prashanth varma) ఆసక్తికర వ్యాఖ్య్యలు చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘హనుమాన్‌’ (hanuman)రిలీజ్‌ విషయంలో వెనక్కి తగ్గకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘సినీ ఇండస్ట్రీకి  సంక్రాంతి పెద్ద పండుగ. పెద్ద సినిమాల  విడుదలకు బెస్ట్‌ సీజన్ . వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. సంక్రాంతి అనగానే సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు మూడు క్యూలో ఉంటాయి. ఈసారి 5 చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందుకే ఇంతగా పోటీ ఉంది. అందులో మాది చిన్న సినిమా. మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో ‘గుంటూరు కారం’, ‘హనుమాన్‌’ జనవరి 12న విడుదల కానున్నాయి. దీంతో మా సినిమా విడుదలను వాయిదా వేయాలని పలువురు అడిగారు. మాకు ఏ మాత్రం వీలున్నా వేరే డేట్‌కి వెళ్లేవాళ్లం. మా సినిమాకు ఇప్పుడు హిందీ మార్కెట్‌ ఎంతో ముఖ్యం. నార్త్‌లో మా చిత్రాన్ని పంపిణి  చేస్తున్న వాళ్లు.. రెండు నెలల క్రితమే సినిమా చూశారు. ఈ సినిమాపై మా కంటే వాళ్లకే ఎక్కువ నమ్మకం ఉంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ నార్త్‌లో విపరీతంగా ప్రమోట్‌ చేశారు. రిలీజ్‌ వాయిదాకు వాళ్లు అంగీకరించలేదు. అందుకే మేము అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నాం’’ అని ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత సహకారంతోనే సినిమాను ఈ స?్థయిలో తీర్చిదిద్దగలిగానని తెలిపారు. ‘హనుమాన్‌’తోపాటు మరో చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు ప్రశాంత వర్మ చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడతాని అన్నారు. తేజ సజ్జా - ప్రశాంత్‌వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. సోషియో ఫాంటసీ కథాంశంతో సూపర్‌హీరో ఫిల్మ్‌గా తీర్చిదిద్దారు. 

Updated Date - Dec 31 , 2023 | 04:41 PM