SS Rajamouli: దర్శకేంద్రుడి తనయుడి సినిమా ఎలా మిస్‌ అయిందంటే!

ABN , First Publish Date - 2023-07-18T18:33:43+05:30 IST

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). ఆయనతో సినిమా అంటే ఏ హీరో అయినా క్యూ కట్టాల్సిందే! దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న ఆయన గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. అయితే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడిని (Prakash Kovelamudi) డైరెక్ట్‌ చేేస అవకాశం మిస్సయింది.

SS Rajamouli: దర్శకేంద్రుడి తనయుడి సినిమా ఎలా మిస్‌ అయిందంటే!

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). ఆయనతో సినిమా అంటే ఏ హీరో అయినా క్యూ కట్టాల్సిందే! దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న ఆయన గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. అయితే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడిని (Prakash Kovelamudi) డైరెక్ట్‌ చేేస అవకాశం మిస్సయింది. అదేలా అంటే.. ఎన్టీఆర్‌తో ‘స్టూడెంట్‌ నెం.1’ తీసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. దానికి సంబంధించిన కథ చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమాకు ‘విజయ సింహ’ (Vijayasimha) అనే పేరు కూడా అనుకున్నారు. ఆర్తి అగర్వాల్‌ చెల్లెలు అదితి అగర్వాల్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారు. నాలుగు నెలలపాటు స్ర్కిప్ట్‌ వర్క్‌ చేశారు. కానీ ఏమైందో సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత జాన్‌ మహేంద్రన్‌ దర్శకత్వంలో ‘నీతో’ చిత్రం ద్వారా ప్రకాశ్‌ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రాజమౌళి ‘సింహాద్రి’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ప్రకాశ్‌ తదుపరి దర్శకుడి మారారు. ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్‌ జీరో’ చిత్రాలను తెరకెక్కించారు. బాలీవుడ్‌లో. 2019లో కంగనా రనౌత్‌ కీలక పాత్రలో ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా తీశారు.

Updated Date - 2023-07-18T18:43:47+05:30 IST