Ram Charan -Upasana: ప్రత్యేక బహుమతి.. బలం, ఆశకు ఇదొక ప్రతీక

ABN , First Publish Date - 2023-06-18T00:22:39+05:30 IST

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దంపతులకు ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఓ బహుమతి అందింది. పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక ఉయ్యాలను తయారు చేయించి ఈ సంస్థ ఉపాసనకు అందజేశారు.

Ram Charan -Upasana: ప్రత్యేక బహుమతి.. బలం, ఆశకు ఇదొక ప్రతీక

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దంపతులకు ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఓ బహుమతి అందింది. పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక ఉయ్యాలను తయారు చేయించి ఈ సంస్థ ఉపాసనకు అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో సంసంబంధిత ఫొటోలు పోస్ట్‌ చేశారు.

1.jpg

‘‘సెక్స్‌ ట్రాఫికింగ్‌లో చిక్కుకుని బయటపడ్డ మహిళలను ప్రజ్వల సంస్థ ఆశ్రయం ఇస్తోంది. వారిలోని కొందరు నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఉయ్యాలను యంత్రాలు ఉపయోగించకుండా హ్యాండ్‌క్రాప్‌ ద్వారా ఈ ఉయ్యాల తయారు చేశారు. నా దృష్టిలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. బలం, ఆశకు ఇదొక ప్రతీక. వారిలోని పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఇది సూచిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డకు చిన్నప్పటి నుంచే ఇలాంటి విషాలు బహిర్గతం కావాలని కోరుకుంటున్నారు. మరచిపోలేని బహుమతి ఇచ్చిన ప్రజ్వల టీమ్‌కు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌లోనే తన భర్త చెర్రీతో దిగిన కొన్ని ఫొటోలు ఎడిట్‌ చేసిన తాము అతి త్వరలో ముగ్గురం కానున్నామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు గుడ్‌న్యూస్‌ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-06-18T10:16:07+05:30 IST