Salaar Release Trailer: ఇక ఫ్యాన్స్‌ను ఆప‌డం క‌ష్ట‌మే.. అదిరిపోయిన స‌లార్ సెకండ్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:56 PM

ప్ర‌భాస్ ఫ్యాన్స్ గ‌త వారం రోజులుగా ఎదురు చూస్తున్న ట్రైలర్ వ‌చ్చేసింది. అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.

Salaar Release Trailer: ఇక ఫ్యాన్స్‌ను ఆప‌డం క‌ష్ట‌మే..  అదిరిపోయిన స‌లార్ సెకండ్ ట్రైల‌ర్‌
salaar

ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ గ‌త వారం రోజులుగా ఎదురు చూస్తున్న ట్రైలర్‌ వ‌చ్చేసింది. మొద‌ట విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌పై మిశ్ర‌మ స్పంద‌న రావ‌డంతో చాలా మంది అభిమానులు ఈ ట్రైల‌ర్ పై భారీ అంచ‌నాలు పెట్టుకోగా వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా తీర్చిదిద్దారు. కేజీఎఫ్ ను తలదన్నేలా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ తో మొదటి నుంచి చివరి వరకు ప్రభాస్ ను మాత్రమే బాగా హైలైట్ చేస్తూ ట్రైలర్ కట్ చేశారు.

‘చిన్న‌ప్పుడు నీకో క‌థ చెప్పేవాడినంటూ ప‌ర్శియ‌న్ రాజు గురించి చెబుతూ ఆ సుల్తాన్ సామ్రాజ్యానికి ఆప‌ద వ‌స్తే ఒక్క‌డికే చెప్పేవాడు.. అత‌ను సుల్తాన్ కావాల‌నుకున్న‌ది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు.. వ‌ద్ద‌నుకున్న‌ది ఏదైనా అంతం చేసేవాడు’ అంటూ వాయిస్ ఓవర్ తో ప్రారంభ‌మైన ట్రైల‌ర్ ఆద్యంతం ప్ర‌భాస్ అభిమానుల‌ను టార్గెట్ చేసి క‌ట్ చేసినట్టు అర్ధం అవుతుంది.


సినిమాలో నటుల ఎలివేషన్ షాట్స్, బ్యా గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండగా ఇది వరకు చాలా సినిమాలలో వాడిన గన్నులను మించి ఇందులో మరో కొత్త స్టైల్ లో గన్స్ వాడడం గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రబాస్ కనిపించిన ప్రతి సారి ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్, ఇచ్చిన ఎలివేషన్ ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా అసలు ప్రభాస్ అంటే అనే రేంజ్ లో ఉన్నాయి.

‘సలార్‌.. పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో మొదటి భాగం డిసెంబ‌ర్ 22న‌ విడుదల అవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్​, పృథ్విరాజ్‍ సుకుమారన్​, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, శ్రియారెడ్డి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ట్రైల‌ర్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబ‌రాలు అంబ‌రాన్నంటడం గ్యారెంటీ. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Dec 18 , 2023 | 04:27 PM