Adipurush: ముందు అభిమానులకే, తరువాతే వేరేవాళ్లకి, అదీ ప్రభాస్ అంటే !

ABN , First Publish Date - 2023-05-04T12:15:41+05:30 IST

ప్రభాస్, కృతిసనన్ రాముడు, సీతగా నటిస్తున్న 'ఆదిపురుష్' జూన్ 16 న విడుదలకు అంత సిద్ధంగా వుంది. అయితే ముందుగా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకే ముందు చూపిస్తా అంటున్నాడు

Adipurush: ముందు అభిమానులకే, తరువాతే వేరేవాళ్లకి, అదీ ప్రభాస్ అంటే !

ప్రభాస్ (Prabhas) నటించిన, ఓంరౌత్ (Om Raut) దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా జూన్ 16 (June 16) న విడుదల అవుతోందని, అందులో ఎటువంటి మార్పు లేదని తెలిసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ లభించబోతోంది. ఈ ట్రైలర్ 3డి (3D) లో చూపించబోతున్నట్టుగా తెలిసింది. అయితే ఇది ముందు అభిమానులకు మాత్రమే చూపించమని ప్రభాస్ చాలా గట్టిగా చెప్పడంతో ఈ చిత్ర నిర్వాహకులు మే 8 #TrailerOnMay8ForFans వ తేదీన ఈ ట్రైలర్ అభిమానులకు చూపిస్తారని తెలిసింది.

దేశం అంతా వున్న ప్రభాస్ అభిమానులకు, కొన్ని థియేటర్స్ సెలెక్ట్ చేసి అందులో ఈ ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారని తెలిసింది. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ లో కూడా కొన్ని థియేటర్స్ ని సెలెక్ట్ చేసి అభిమానులకు మే 8వ తేదీ రాత్రి చూపిస్తారని తెలిసింది.

Adipurush1.jpg

ఆ తరువాత మే 9 వ తేదీన ట్రైలర్ డిజిటల్ గా విడుదల చేస్తారని తెలిసింది. 'ఆదిపురుష్' #Adipurush నిర్వాహకులు ఈ సినిమా ప్రచారాన్ని భారీ ఎత్తున చెయ్యడానికి కూడా నిర్ణయించుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు దేశం అంతా జరుగుతాయని అంటున్నారు. అందులో భాగం గానే ముందుగా ముంబై లో మే 8, 9 న గానీ ఒక మీడియా సమావేశం ఉంటుంది అని కూడా తెలిసింది.

అలాగే తిరుపతి (Tirupati), హైదరాబాద్ (Hyderabad) లలో రెండు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఈ చిత్ర ప్రచార ఈవెంట్ లు చెయ్యడానికి చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు కాగా, ఓం రౌత్, భూషణ్ కుమార్, రాజేష్ మోహనన్, కృష్ణ కుమార్ నిర్మాతలు. 'రామాయణం' ఆధారంగా తీసిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపిస్తే, కృతి సనన్ (KritiSanon) సీత (Sitha) గా వేసింది. రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) వేశాడు. ఈ సినిమా న్యూయార్క్ లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్ (TribecaFestival) లో జూన్ 13 న ప్రీమియర్ వేస్తున్నారు కూడా.

Updated Date - 2023-05-04T12:21:02+05:30 IST