Poye Enugu Poye: ఏనుగు పిల్ల బలిని.. ఓ కుర్రాడు ఎలా ఆపాడు? ఇదే కథ..
ABN , First Publish Date - 2023-05-28T17:06:09+05:30 IST
నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అనేదే ‘పోయే ఏనుగు పోయే’ చిత్ర కథాంశమని అన్నారు చిత్ర దర్శక నిర్మాత కె శరవణన్. తాజాగా ఈ చిత్రం నుంచి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోయే ఏనుగు పోయే’ (Poye Enugu Poye). ‘ధమాకా, బలగం’ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని ‘ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని’ (Edochi Paitesina Chinna Danni) అనే లిరికల్ వీడియో సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత కె.శరవణన్ (K Saravanan) చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. మాసివ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియోని తాజాగా లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాటను రచించారు. ‘పోయే ఏనుగు పోయే’ కథ విషయానికొస్తే.. నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. (Poye Enugu Poye Movie Song Launched)
ఇందులో బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar), ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము. ఎంతో వినోదభరితంగా, భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ సినిమా విడుదల అనంతరం మంచి ఆదరణ పొందుతుందన్న నమ్మకంతో ఉన్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు
*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది
*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?
*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు
*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..
*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!
*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!