Rakshit Atluri: పోలీస్‌ స్టేషన్‌ ఏం జరిగిందంటే!

ABN , First Publish Date - 2023-03-26T18:16:26+05:30 IST

రక్షిత్‌ అట్లూరి (Rakshit atluri) హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్‌ నిర్మిస్తున్న ‘పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (Police Station pvt ltd) ) చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

Rakshit Atluri: పోలీస్‌ స్టేషన్‌ ఏం జరిగిందంటే!

రక్షిత్‌ అట్లూరి (Rakshit atluri) హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్‌ నిర్మిస్తున్న ‘పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (Police Station pvt ltd) ) చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి చందూ మొండేటి క్లాప్‌ ఇచ్చారు. ప్రసన్నకుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పోలీస్‌ నేపథ్యం సాగే యాక్షన్‌ డ్రామా ఇది. రెగ్యులర్‌ కథలకు భిన్నంగా ఉంటుందీ సినిమా. ఏప్రిల్‌ 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుంది.’’ అని అన్నారు.

హీరో రక్షిత్‌ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. నా పాత్ర, ఇతర విషయాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చెప్పారు.

Updated Date - 2023-03-27T14:43:51+05:30 IST