Pawan kalyan- Sai Dharam tej: వచ్చేవారం మరో సర్ప్రైజ్... ఏంటంటే!
ABN , First Publish Date - 2023-04-18T16:03:19+05:30 IST
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 75 శాతం పూర్తి చేశారు. ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రం టాకీ పూర్తిచేసుకుంది. ‘
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan kalyan) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 75 శాతం పూర్తి చేశారు. ‘వినోదాయ సితం’ (Vinodhaya sitam) కు రీమేక్‌గా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రం టాకీ పూర్తిచేసుకుంది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం కూడా ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ (OG)చిత్రం షూటింగ్ ఈ నెల 15న ముంబైలో ప్రారంభమైంది. పవన్‌కల్యాణ్ సోమవారం సెట్లో అడుగుపెట్టారు. ఈ నెలాఖరు వరకూ ఈ సినిమా షెడ్యూల్ జరుగుతుంది.
ఇలా పవన్ కల్యాణ్ అటు రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటూనే అంగీకరించిన సినిమాలకు కాల్షీట్లు సర్దుతున్నారు. ప్రస్తుతం ఆయనతో కలిసి సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న 'PKSDT' చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారంలో ‘ఒజి’కి సంబంధించి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆనందపరిచారు పవన్‌కల్యాణ్. వచ్చేవారం వినోదాయ సీతం రీమేక్ టైటిల్‌ను ప్రకటిస్తారని ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే చక్కని టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. ‘వచ్చే వారం నిర్మాణ సంస్థ ఇచ్చే సర్ప్రైజ్ను ఆస్వాదించడానికి అందరూ సిద్ధంకండి’ అంటూ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. మాతృకలో తంబి రామయ్య పోషించిన పాత్రను తెలుగులో సాయిధరమ్ తేజ్ (Sai dharam tej) పోషిస్తున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.