PKSDT: అప్పుడే విడుదల తేదీ కూడా ప్రకటించేశారు.. రిలీజ్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-03-24T16:05:56+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘వినోదాయ సీతం’ (Vinodhaya Sitham) రీమేక్‌ షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ (SaI Dharam Tej) కీలక పాత్ర పోషిస్తున్నారు.

PKSDT: అప్పుడే విడుదల తేదీ కూడా ప్రకటించేశారు.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘వినోదాయ సీతం’ (Vinodhaya Sitham) రీమేక్‌ షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ (SaI Dharam Tej) కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్‌తో కలసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదల చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వరుసగా అందిస్తామన్నారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రి విక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు.

‘వినోదాయ సీతం’ కోసం పవన్ కల్యాణ్ దాదాపుగా 20రోజులు డేట్స్ కేటాయించారు. ఆయనకు సంబంధించిన భాగాన్ని మార్చి చివరి లోపు పూర్తి చేయనున్నారు. ఈ డేట్స్ కోసమే పవన్ దాదాపుగా రూ.50కోట్లను ఛార్జ్ చేశారట. తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో పవన్ ఈ విషయాన్నే ప్రస్తావించారు. రోజుకు రెండు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రీకరణను 60శాతానికి పైగా పూర్తి చేశారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5నుంచి ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. సుజిత్ దర్శకత్వంలోను నటించడానికి పవన్ అంగీకరించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా రూపొందనుంది.

^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-24T16:07:00+05:30 IST