Peddha Kapu 1: స్కంద 15నే వస్తాం అన్నారు, అందుకనే మేము 29 అనుకున్నాం: నిర్మాత
ABN , First Publish Date - 2023-09-26T12:09:32+05:30 IST
ఈ సెప్టెంబర్ ఆఖరి వారంలో మూడు సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో విడుదలవడం పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. ఇలా ఎందుకు జరిగింది అన్నదానికి 'పెదకాపు' నిర్మాత తాము 'స్కంద' నిర్మాత తో మాట్లాడే మా సినిమా తేదీ ప్రకటించాం. కానీ...
గత రెండు వారాలు ఒక్క పెద్ద తెలుగుసినిమా కూడా విడుదల కాలేదు. చాలా చోట్ల థియేటర్స్ అన్నీ వెలవెలబోయాయి. రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) నటించిన 'స్కంద' #Skanda సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి వుంది, అలాగే 'చంద్రముఖి 2' #Chandramukhi2 కూడా అదే రోజు విడుదల కావాల్సి వుంది.
అయితే సెప్టెంబర్ 28న విడుదలవ్వాల్సిన ప్రభాస్ (Prabhas) నటించిన 'సలార్' #Salaar ఆరోజున కాకుండా వాయిదా పడింది అని తెలిసింది. వెంటనే 'పెదకాపు' #PeddhaKapu1 నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి (MiryalaRavinderReddy) తన సినిమా సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే రామ్ పోతినేని నటించిన 'స్కంద' #Skanda నిర్మాత కూడా తాము తమ సినిమా విడుదల పోస్టుపోన్ చేస్తున్నాం అని సెప్టెంబర్ 28 న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.
ఇలా మూడు సినిమాలు ఒక్క రోజు తేడాలో విడుదలవడం మంచిదా, అన్ని సినిమాలకి ఆదాయం పడిపోతుంది కాదా అని 'పెదకాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ని అడిగినప్పుడు, అతను తాను మిగతావాళ్లను అడిగే తమ సినిమా విడుదల తేదీ ప్రకటించాను అని చెప్పారు. ముందుగా సాలార్ పోస్ట్ పోన్ అని తెలిసి, సెప్టెంబర్ 28 వద్దామనుకున్నాం. కానీ అదే తేదీకి 'స్కంద' #Skanda వస్తుందని విని, ఆ చిత్ర నిర్మాత శ్రీనివాస్ గారితో మాట్లాడాను. ఆయన మేము 15 కే వస్తున్నాం. మీరు 28 వ తేదీ వేసేసుకోండి అన్నారు. కానీ ఆయన కి ఇష్టం లేకపోయినా మళ్లీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే కాంపిటీషన్ లేకుండా వచ్చే వాళ్ళం, అని వివరణ ఇచ్చారు మిర్యాల రవీందర్ రెడ్డి.
ఇది పరిశ్రమలో సరైన పోటీ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలా రెండు సినిమాల ఆదాయం పడిపోతుంది అని. అయితే ఏ సినిమాలో దమ్ముంటే ఆ సినిమా ఆడుతుంది అనేది ఒక నానుడి, తన సినిమా మీద తనకి నమ్మకం ఉందని రవీందర్ రెడ్డి అన్నారు.