Pawan kalyan: పవన్ భార్య క్రిస్మస్‌ వేడుకలు ఎక్కడంటే!

ABN , Publish Date - Dec 25 , 2023 | 11:08 AM

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌,(Power star Pawan kalyan) జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భార్య శ్రీమతి అనా కొణిదెల (Anna Lezhneva) ప్రీ క్రిస్మస్‌ వేడుకలను (christmas celebration) అనాథ శరణాలయంలో నిర్వహించారు.

Pawan kalyan: పవన్ భార్య  క్రిస్మస్‌ వేడుకలు ఎక్కడంటే!

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌,(Power star Pawan kalyan) జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భార్య శ్రీమతి అనా కొణిదెల (Anna Lezhneva) ప్రీ క్రిస్మస్‌ వేడుకలను (christmas celebration) అనాథ శరణాలయంలో నిర్వహించారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో కాసేపు  ముచ్చటించారు. చిన్నప్నటి తన  స్కూల్‌ డేస్‌ గురించి చెప్పారు. విద్యార్థుల విద్యాబుద్థుల గురించి తెలుసుకున్నారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌ నిర్వాహకులకు నిత్యావసర సరుకులను అందచేశారు. ఈ సందర్భంగా అనా కొణిదెలను జీవోదయ హోమ్‌ నిర్వాహకులు సత్కరించారు.

Updated Date - Dec 25 , 2023 | 11:15 AM