Bro: సెట్ మీద మేనల్లుడిని ఒక ఆటాడుకున్న పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2023-07-19T19:52:42+05:30 IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ లో తన మేనల్లుడు మీద పవన్ కళ్యాణ్ ప్రాంక్స్ వేసి ఆటపట్టించాడు. నిజ జీవితంలో ఇద్దరి మధ్య వున్న ఆ బాండ్ సినిమాలో బాగా వచ్చింది అని సాయి తేజ్ చెపుతున్నాడు

Bro: సెట్ మీద మేనల్లుడిని ఒక ఆటాడుకున్న పవన్ కళ్యాణ్
Sai Dharam Tej and Pawan Kalyan from Bro film

పవన్ కళ్యాణ్ (PawanKalyan), అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) కథానాయకులుగా నటిస్తున్న సినిమా 'బ్రో' #Bro ఈనెల 28న విడుదల అవుతోంది. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు కాగా ఇందులో, కేతిక శర్మ (KetikaSharma), ప్రియా వారియర్ (PriyaPrakashVarrier) కథానాయకురాలుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కళ్యాణ్ కి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని చెపుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి నటిస్తుంటే అది అభిమానులకి పండగే మరి.

ఒకరోజు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారుట. నువ్వు లీడ్ యాక్టర్ ఒక సినిమా చేస్తున్నావ్, అందులో నేను నిన్ను డ్రైవ్ చేసే ఒక ముఖ్యమైన పాత్ర నేను వేస్తున్న అని పవన్ కళ్యాణ్ చెప్పగానే సాయి ధరమ్ తేజ్ తడబడి అది మామయ్య తన మీద వేస్తున్న ప్రాంక్ అనుకున్నాడట. కానీ అదే విషయం మళ్ళీ చెప్పి అప్పుడు విషయం చెప్పాక గానీ సాయి ధరమ్ తేజ్ నమ్మలేదు. ఈ సినిమా తన జీవితంలో గుర్తుచుకోవాల్సిన ఒక అద్భుత ఘట్టం అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఆలా ఈ 'బ్రో' సినిమా కూడా మొదలైంది అని చెప్పాడు సాయి తేజ్.

bro1.jpg

షూటింగ్ మొదలయ్యాక చాలా సార్లు సాయి ని సెట్స్ లో మామయ్య పవన్ కళ్యాణ్ #BroMovie ఆటపట్టించారు అని చెప్పాడు సాయి తేజ్. ముందురోజు దర్శకుడు సముద్రఖని మూడు పేజీల డైలాగ్ ఒకటి సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి రేపు ఈ సన్నివేశం వుండబోతోంది అని చెప్పారు. మరుసటి రోజు సాయి తేజ్ బాగా ప్రిపేర్ అయి వచ్చాడు, కానీ దర్శకుడు మాత్రం చివరి మూడు లైన్స్ చెప్పు మొత్తం వద్దు అనేసరికి సాయి ఊపిరి పీల్చుకొని ముందు లైన్స్ వదిలేసి చివరి ఆ మూడు లైన్స్ బాగా ప్రిపేర్ అయిపోయాడు.

సెట్ లోకి వెళ్లేసరికి పవన్ కళ్యాణ్ కూడా వున్నారు, చివరి మూడు లైన్స్ సాయి చెప్పబోతుంటే, పవన్ కళ్యాణ్ అలా కాదు మొత్తం డైలాగ్ చెప్పు అన్నారు, ఆలా అనేసరికి సాయి డైరెక్టర్ మూడు లైన్లు చాలు అన్నారు అన్నా, మొత్తం డైలాగ్ చెప్పు అనేసరికి, సాయి కి సరిగా గుర్తు రాలేదు. ఒక అయిదు నిముషాలు టైము కావాలని చెప్పి, కో-డైరెక్టర్ ని అడిగి డైలాగ్ పేపర్ తెప్పించి మొత్తం డైలాగ్ అంతా ప్రిపేర్ అయి వచ్చి షాట్ కి రెడీ అని చెప్పాడు. సన్నివేశం మొదలవ్వగానే మొత్తం డైలాగ్ వద్దు చివరి మూడు లైన్స్ చెప్పారా సాయి అన్నారు పవన్ కళ్యాణ్.

అప్పుడు అర్థం అయిపొయింది సాయి తేజ్ కి, మామయ్య తనని ఆడేసుకుంటున్నాడు అని. ఆలా ప్రతి రోజు మామయ్యతో పని చేసే ప్రతి సన్నివేశం ఒక మెమరీ అంటాడు సాయి తేజ్. మా ఇద్దరి మధ్య వుండే రియల్ బాండ్, సినిమాలో కనిపిస్తుంది అని చెప్తున్నాడు. సినిమాలో ఇద్దరి పాత్రలు ఆలా ఉండాలి, అది బాగా కుదిరింది మా మామయ్యతో అని అన్నాడు.

Updated Date - 2023-07-19T19:52:42+05:30 IST