Pawan Kalyan: ప్రభాస్‌ - మహేశ్‌ నా కన్నా పెద్ద హీరోలు.. నేను ప్యాన్‌ ఇండియా హీరోను కాదు!

ABN , First Publish Date - 2023-06-22T11:04:56+05:30 IST

‘సినిమా అనేది వినోదం, ఆనందం, సినిమాల విషయంలో ఎవరినైనా అభిమానించండి. ఏ హీరోనైనా ఇష్టపడండి. కానీ అది దానిని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. సినిమా వేరు.. రాజకీయం వేరు. పొలిటిక్స్‌ దగ్గరికి వచ్చేసరికి నా మాట వినండి. సమష్టిగా ఆలోచిద్దాం. పోరాటం చేేసవాళ్లు ఈ సమాజానికి కావాలి. నేను ఒక్కడినే సరిపోను. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు కావాలి’’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan: ప్రభాస్‌ - మహేశ్‌ నా కన్నా పెద్ద హీరోలు.. నేను ప్యాన్‌ ఇండియా హీరోను కాదు!

‘‘సినిమా అనేది వినోదం, ఆనందం, సినిమాల విషయంలో ఎవరినైనా (Pawan Kalyan) అభిమానించండి. ఏ హీరోనైనా ఇష్టపడండి. కానీ అది దానిని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. సినిమా వేరు.. రాజకీయం వేరు. పొలిటిక్స్‌ దగ్గరికి వచ్చేసరికి నా మాట వినండి. సమష్టిగా ఆలోచిద్దాం. పోరాటం చేేసవాళ్లు ఈ సమాజానికి కావాలి. నేను ఒక్కడినే సరిపోను. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు కావాలి’’ అని పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan Speech) అన్నారు. వారాహి విజయయాత్రలో (Varahi Vijaya Yatra)భాగంగా కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘మీ అభిమానులు, జూ. ఎన్టీఆర్‌ (Ntr)అభిమానులు .. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అని తరచూ గొడవపడుతుంటారు’’ అని ఇటీవల కొందరు నాతో అన్నారు. సినిమా అనేది వినోదం, ఆనందం. ఇండస్ట్రీలో చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణగారి (Balakrishna) దగ్గరి నుంచి మహేశ్‌, అల్లు అర్జున్‌ ప్రభాస్‌(Prabhas), చరణ్‌, 9Charan)ఎన్టీఆర్‌ ఇలా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. వారంటే నాకు ఇష్టం. ప్రతి ఒక్కరి సినిమా నేను చూస్తాను. ఏదో ఒక సందర్భంలో మేమంతా కలుస్తాం. సరదాగా మాట్లాడుకుంటాం. ప్రభాస్‌, మహేశ్‌ నాకన్నా పెద్ద హీరోలు. నా కన్నా ఎక్కువ పారితోషికం తీసుకోవచ్చు. తారక్‌, రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్స్‌ అయ్యారు. నేటితరం హీరోలంతా పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ తెలీదు. ఆ విషయంలో నాకు ఎలాంటి ఇగో లేదు. సగటు మనిషి బాగుంటే చాలనుకుంటా. సినిమాల పరంగా మీరు ఎవరినైనా ఇష్టపడండి. మీకున్న అభిమానాన్ని రాజకీయాల్లో చూపించకండి. ఇక్కడ రైతుకు కులం లేదు. కులం పరంగా మనలో మనం గొడవ పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాల విషయంలో ఎవరినైనా ఇష్టపడండి కానీ రాజకీయం విషయంలో సమష్టిగా ఆలోచిద్దాం. ఈ విషయంలో నా మాట వినండి’’ అని అన్నారు.

Updated Date - 2023-06-22T11:05:28+05:30 IST