Ram Charan - Oscar: ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడంలాంటిది!
ABN , First Publish Date - 2023-03-10T17:54:33+05:30 IST
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించాలనుంది అన్న ఆయన త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ గురించి వార్త వస్తుంది అని వెల్లడించారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించాలనుంది అన్న ఆయన త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ గురించి వార్త వస్తుంది అని వెల్లడించారు. అలాగే రాజమౌళి గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలిపారు. మార్వెల్ చిత్రాలకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే పెద్ద పార్టీ ఇస్తానని చెప్పారు. ‘‘రాజమౌళి మార్వెల్ చిత్రాలను డైరెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదే జరిగితే.. అప్పుడు అందరికీ పార్టీ ఇస్తాను. నేను వాళ్ల ప్రతి సినిమాలో ఉండాలనుకుంటాను. ప్రస్తుతం సినిమారంగానికి ఎలాంటి హద్దులు లేవు. హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేవు. అలాంటి ఈ రంగంలో నేనూ భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు.
తన తండ్రి చిరంజీవి గురించి కూడా చెర్రీ మాట్లాడారు. ‘‘నేను అమెరికా రాబోయే ముందు నాన్న ఎంతో ఎమోషనల్ అయ్యారు. నాన్నగారి జర్నీలో ఎన్నో విజయాలు అందుకున్నారు. 80వ దశకంలో ఓసారి ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. అదే పెద్ద విజయంగా, గౌరవంగా భావించానని నాన్న చెబుతుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయిందని తెలిసి చాలా ఆనందించారు. ఆస్కార్ అవార్డు కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ సాధించడం మాకు ఒలింపిక్‌లో బంగారు పతకం లాంటిది’’ అని రామ్ చరణ్ అన్నారు.