Kiran Abbavaram: ప్రమాణం పూర్తిగా నాకు తెలీదు: కిరణ్ అబ్బవరం
ABN , First Publish Date - 2023-04-05T15:08:41+05:30 IST
ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న నటుల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. సినిమాలు కూడా రెగ్యులర్ గా విడుదల అవుతున్న నటుల్లో ఇతను ఒకడు. ఇతని సినిమా 'మీటర్' ఈ వారం విడుదల అవుతోంది, అయితే ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఒక సంఘటన....
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఈసారి 'మీటర్' (Meter) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ వారం వస్తున్నాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ (Pre-release event) ఈవెంట్ హైదరాబాద్ లోని ఒక హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు దర్శకులు మలినేని గోపీచంద్, (Malineni Gopichand) బుచ్చిబాబు (Buchibabu) స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. అందరూ మాట్లాడిన తరువాత చివరగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడేడు. అతను మాట్లాడుతుండగా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, పెద్ద స్టార్స్ ఇలా ఫంక్షన్ కి వచ్చినప్పుడు అభిమానులు డయాస్ ఎక్కి ఆ స్టార్ తో ఫోటో కోసం తాపత్రయపడతాడు కదా, అలానే ఇక్కడ కిరణ్ అబ్బవరం ఫంక్షన్ లో కూడా జరిగింది.
కిరణ్ అబ్బవరం తన స్పీచ్ ఇలా మొదలెట్టగానే ఒకతను వచ్చి సెల్ఫీ అన్నాడు కిరణ్ తో. కిరణ్ కూడా లేదు, వద్దు, ఎందుకు వచ్చావు అని ఏమీ అనలేదు కానీ, వచ్చిన అతను మాత్రం ఎవరో ఎంప్లాయ్ లా కనపడుతున్నాడు, ఎందుకంటే అతని నడుముకి ఐడెంటిటీ కార్డు వేలాడుతోంది. అదీ కాకుండా తాను అభిమానిలా దూసుకు రాలేదు, చాలా కూల్ గా, కామ్ గా వచ్చి సెల్ఫీ అడిగి, తీసుకొని కామ్ గా వెళ్ళిపోయాడు, అతన్ని ఎవరూ అడ్డుకోలేదు కూడా.
వెంటనే కిరణ్ అబ్బవరం ఈ సంఘటన మీద స్పందిస్తూ, ఇవి అలవాటు అయిపోయాక ఇది ప్లానెడనో (Planned) లేక అన్ ప్లానెడనో (Unplanned) అని చెప్పటానికి కూడా నాకు తెలియయటం లేదు. దీని గురించి ఏమి చెప్పినా ఇంకో ఇష్యూ వస్తుంది. ప్రమాణ పూర్తికంగా ఈ విషయం నాకు తెలీదు అని చెప్పాడు కిరణ్.
తరువాత వచ్చిన అతిధులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబుల గురించి మాట్లాడేడు. కిరణ్ అబ్బవరం నాన్నగారు బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమాని అని చెప్పాడు. అందుకని గోపీచంద్ మలినేనికి మెసేజ్ పెట్టాను, రాబోయ్ సినిమా 'నరసింహనాయుడు', 'సమరసింహా రెడ్డి' రెండు కలిపితే ఎలా ఉంటాడో ఆలా అని, అలాగే 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) బ్లాస్ట్ అయింది. అలాగే బుచ్చిబాబు అన్న వంద కోట్ల సినిమా కొట్టినా కూడా నార్మల్ గా ఉంటాడు. ఇప్పుడు చరణ్ (Ram Charan) అన్నతో సినిమా చేస్తున్నాడు, నేను కూడా వెయిటింగ్ అన్న అన్నాడు కిరణ్. అలాగే 'మీటర్' ప్రొడ్యూసర్ చెర్రీ కి థేంక్స్ చెప్పాడు, ఎందుకంటే సినిమాకి సరిపడా బడ్జెట్ ని ఇచ్చినందుకు అని చెప్పాడు.