Biggboss 7: మంచి నిర్ణయమే తీసుకున్నాడని ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-12-17T10:04:54+05:30 IST

బిగ్‌బాస్‌ షోలో 7వ (Biggboos 7 Finale) సీజన్‌ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. గ్రాండ్‌ ఫినాలే సర్వ సిద్ధమైంది. ప్రస్తుతం ఎలిమినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్‌, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్‌ నుంచి బయటకొచ్చేసినట్లు సమాచారం. మిగిలిన నలుగురు ఇంటి సభ్యుల్లో ఓ కంటెస్టెంట్‌.. సూట్‌కేసులోని మొత్తానికి టెంప్ట్‌ అయినట్లు టాక్‌.

Biggboss 7: మంచి నిర్ణయమే తీసుకున్నాడని ప్రశంసలు!

బిగ్‌బాస్‌ షోలో 7వ (Biggboos 7 Finale) సీజన్‌ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. గ్రాండ్‌ ఫినాలే సర్వ సిద్ధమైంది. ప్రస్తుతం ఎలిమినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్‌, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్‌ నుంచి బయటకొచ్చేసినట్లు సమాచారం. మిగిలిన నలుగురు ఇంటి సభ్యుల్లో ఓ కంటెస్టెంట్‌.. సూట్‌కేసులోని మొత్తానికి టెంప్ట్‌ అయినట్లు టాక్‌. ఇంతకీ ఆ సూట్‌ తీసుకుని బయటకు వెళ్లింది ఎవరు? ఎందుకు టెంప్ట్‌ అయ్యాడు అన్నది తెలుసుకోవాలంటే ఫినాలే చూడాల్సిందే! (Arjun, Priyanka, Yavar)

గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్‌కేసు సంప్రదాయం ఏంటనేది అర్థమవుతోంది. 4వ సీజన్‌లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్‌.. రూ.25 లక్ష?ని తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్‌లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకొంది.. గత సీజన్‌లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్‌.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్‌కేసు ఆఫర్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రూ.10 లక్షలు ఆఫర్‌ చేసి పోటీ నుంచి డ్రాప్‌ అయ్యే అవకాశం ఇచ్చాడు. అయితే దీనిని ఎవరూ వినియోగించలేదు.

స్పై టీమ్‌లో ఉండటం, ప్లస్‌ గేమ్స్‌లోనూ మంచిగా ఆకట్టుకోవడం, తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్‌.. చివరి వరకూ వచ్చాడు. రూ.10 లక్షలు మొత్తం ఆఫర్‌ చేసినప్పుడు లైట్‌ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్‌.. ఖాళీ చేతులతో ఎలిమినేట్‌ అయ్యేసరికి కాస్త మెదడుకి మేత వేశాడు. మిలిగిన ముగ్గురు ప్రశాంత్‌, అమర్‌, శివాజీని దాటి కప్‌ కొట్టడం కష్టం అని అర్థం చేసుకున్నాడో ఏమో నాగార్జున ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్‌కు టెంప్త్‌ అయ్యాడని ఆ సూట్‌కేస్‌ తీసుకుని సెల్ఫ్‌ ఎలిమినేట్‌ అయ్యాడని సమాచారం. జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తూ, టీవీ సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్‌.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే అతను తీసుకున్న నిర్ణయానికి కారణం ఏంటి? ఎవరైనా తనకి హింట్‌ ఇచ్చారా అన్నది తెలియాలంటే ఫినాలే చూడాల్సిందే! అయితే శివాజీ కూడా ఎలిమినేట్‌ అయ్యాడని దాంతోనే శనివారం ఎపిసోడ్‌ పూర్తయిందని తెలుస్తోంది.

Updated Date - 2023-12-17T10:05:15+05:30 IST