Adipurush: పాత్రలని వక్రీకరించి చూపడం తప్పే: తమ్మారెడ్డి

ABN , First Publish Date - 2023-06-28T16:09:18+05:30 IST

తెలుగులో చాలా పౌరాణిక సినిమాలు వచ్చాయని, చాలామంది దర్శకులు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, కానీ ఎన్నడూ ఆ పాత్రల స్వభావాన్ని మార్చి చూపటం, వక్రీకరించటం చెయ్యలేదని, తమ్మారెడ్డి అన్నారు. ఆదిపురుష్ లో పాత్రల వక్రీకరణ ముమ్మాటికీ తప్పే అని తమ్మారెడ్డి భావించారు.

Adipurush: పాత్రలని వక్రీకరించి చూపడం తప్పే: తమ్మారెడ్డి
Adipurush

'ఆదిపురుష్' #Adipurush సినిమా మీద నిరసనల వెల్లువ దేశం అంతటా వినిపించింది. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన ఈ సినిమా కి ఓం రౌత్ (OmRaut) దర్శకుడు కాగా, మనోజ్ ముంతషీర్ (ManojMuntashir) మాటలు రాసాడు. ఈ సినిమా 'రామాయణం' #Ramayanam ప్రాతిపదికగా తీసిన సినిమా అని విడుదలకి ముందు చిత్ర నిర్వాహకులు చెప్పారు. అలాగే ఈ సినిమాని ఇప్పటి యువత తప్పకుండా చూడాలని కూడా చెప్పారు. అయితే ఈ సినిమా తీసిన విధానం, అందులో పాత్రలని నడిపించే తీరు, వారి స్వభావం రామాయణానికి పూర్తి విరుద్ధంగా ఉండటం తో ప్రజలు అందరూ ఈ సినిమాని పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకొని ఈ చిత్ర నిర్వాహకులని ప్రశ్నిస్తున్నాయి.

thammareddybharadwaj.jpg

"'రామాయణం' అనేది అందరికీ తెలిసిన కథ అని, ముఖ్యంగా మన దేశంలో ఎంతో పవిత్రంగా చూసుకునే గ్రంధం అని, అందులోని పాత్రలు, వారి స్వభావాలు ప్రజల మనస్సులో ఆరాధింప పడే విధంగా ఉన్నాయని, అటువంటి పాత్రలని వక్రీకరించి తీయడం చాలా తప్పు" అని, ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ #ThammareddyBharadwaj అన్నారు. పౌరాణిక సినిమా అంటే తెలుగు సినిమాలే అందరికీ గుర్తుకు వస్తాయని, ఎందుకంటే అన్ని వందల సినిమాలు మనం తీశామని, కానీ ఎప్పుడూ ఏ సినిమా కూడా విమర్శలకి గురి కాలేదు అని చెప్పారు తమ్మారెడ్డి. ఈ 'ఆదిపురుష్' అంత విమర్శలకు లోనయ్యింది.

తెలుగులో పౌరాణిక సినిమాలు తీసినప్పుడు చాలా మంది ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, కానీ దేనినీ వక్రీకరించలేదు అని చెప్పారు. 'మాయాబజార్' #Mayabazar సినిమా పౌరాణికం లోంచి కొన్ని పాత్రలను తీసుకొని అల్లిన కల్పిత కథ, కానీ అవన్నీ నిజంలాగే అనిపిస్తుంది, ఎక్కడా ఏ పాత్రని తక్కువ చేసి చూపించలేదు అంత చక్కగా తీశారు. కానీ 'ఆదిపురుష్' లో పాత్రల స్వభావాన్ని పూర్తిగా మార్చివేసి ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా చెయ్యడం తప్పు అని తమ్మారెడ్డి అన్నారు.

Adipurush.jpg

అయితే ఈ సినిమాని ఇప్పుడు నిషేధించటం కుదురుతుందా అని అడిగినప్పుడు, ఇప్పుడు నిషేధించినా, చెయ్యకపోయినా ఒకటే, ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా థియేటర్స్ నుండి తీసేస్తున్నారు అని చెప్పారు. ఓటిటి లో స్ట్రీమింగ్ చెయ్యకుండా కూడా ఆపుచెయ్యలేము, ఎందుకంటే ఓటిటి కంపెనీలు ఇక్కడ ఇండియా జ్యూరిస్ డిక్షన్ లో వుండరు అని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి.

Updated Date - 2023-06-28T16:12:38+05:30 IST