NTR30: ప్రతినాయకుడితో పోరాటం.. త్వరలో పూర్తి!
ABN , First Publish Date - 2023-04-30T11:05:31+05:30 IST
కొరటాల శివ (Kratala siva) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్30’ (NTR30) చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. తారక్ ప్రతినాయకులతో పోరాటం చేస్తున్నారు.
కొరటాల శివ (Kratala siva) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్30’ (NTR30) చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. తారక్ ప్రతినాయకులతో పోరాటం చేస్తున్నారు. ఎదురొచ్చిన వారిని విరుచుకుంటూ వెళ్తున్నారు. తాజా షెడ్యూల్‌లో ఈ ఫైట్ కోసం ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ట్రైన్ సెట్ వేశారు. సినిమాకు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, తారక్ (Fight scenes with Saif ali khan) మధ్య సాగే యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుందని తెలిసింది.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్లె జాన్వీకపూర్ ఈ చిత్రంలో కథానాయిక. ఇటీవల ఆమె కూడా చిత్రీకరణలో పాల్గొంది. తారక్, జాన్వీపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘జనతా గ్యారెజ్’ లాంటి భారీ విజయం తర్వాత కొరటాల, తారక్ కలయికలో వస్తున్న చిత్రమిది. పరాజయం తెలియని కొరటాలకు ‘ఆచార్య’ ఘోర పరాజయం ఎదురైంది. దాంతో మరింత కసిగా కొరటాల ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.