NTR30: ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర సంచలనం

ABN , First Publish Date - 2023-03-09T16:35:08+05:30 IST

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ #NTR30 లో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక సంచలనంగా వుండబోతోంది అని పరిశ్రమలో అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ ఎన్నో రోల్స్ వేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు...

NTR30: ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర సంచలనం

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ #NTR30 ఇంకా లాంఛనంగా ప్రారంభం కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే కొంతమంది పెద్ద పేరున్న సాంకేతిక నిపుణలను, రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) లాంటి వాళ్ళు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి శ్రేదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని కూడా తీసుకున్నారు. ఇలా ఈ సినిమా ఇంకా అధికారికంగా మొదలు పెట్టలేదు, షూటింగ్ కూడా మొదలవ్వలేదు కానీ ఈ సినిమా మాత్రం వార్తల్లో ఉంటూనే వుంది.

jrntr4.jpg

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ 'దేవర' (Devara) అని సోషల్ మీడియా లో వైరల్ అయిన మాట కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా సోషల్ మీడియా లో అనేక వార్తలు వస్తున్నాయి. అవి వింటే కనక ఎన్టీఆర్ పాత్ర ఒక సంచలనమే అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం (Dual Role) పోషించవచ్చు అని కూడా అంటున్నారు. ఇందులో సముద్రం నేపధ్యంలో కథ వుండబోతోంది అని కూడా బయటకి వచ్చింది. అలాగే ఇంతకు ముందు ఈ సినిమా నిర్వాహకులు విడుదల చేసిన పోస్టర్స్ కూడా సముద్రం నేపధ్యం లో వున్నవే. అయితే ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం కానీ లేదా త్రిపాత్రిభినయం (Tripple role) కానీ పోషించవచ్చు అని తెలుస్తోంది.

janhvikapoor4.jpg

ఈమధ్య చాలామంది నటులు డ్యూయల్ రోల్ లేక ట్రిపిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా కథకి అనుగుణంగా ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం ఉండొచ్చు అని, లేకపోతే డ్యూయెల్ రోల్ అయితే కచ్చితంగా ఉంటుంది అని ఒక యూనిట్ సభ్యుడు చెప్పినట్టుగా తెలిసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ ఇంతకు ముందు 'జనతా గ్యారేజ్' (Janatha Garage) అనే సినిమా కలిసి చేశారు, అది చాలా పెద్ద విజయం సాధించింది కూడా. ఈ సినిమా మీద కూడా ఇంకా మొదలెట్టకుండానే అంచనాలు భారీగా వున్నాయి.

Updated Date - 2023-03-09T16:35:49+05:30 IST