NTR: ‘బడిపంతులు’ బతుకు పోరాటం.. కళ్లద్దాలతో..

ABN , First Publish Date - 2023-02-05T10:38:34+05:30 IST

త్రివేణి ప్రొడక్షన్స్‌ ‘బడిపంతులు’ (Badi Panthulu) (30-11-1972) వర్కింగ్‌ స్టిల్‌ ఇది. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్‌.పంతులు నిర్మించి విజయం సాధించిన ‘స్కూల్‌ మాస్టర్‌’ (School Master) చిత్రానికి రీమేక్‌.

NTR: ‘బడిపంతులు’ బతుకు పోరాటం.. కళ్లద్దాలతో..
NTR

త్రివేణి ప్రొడక్షన్స్‌ ‘బడిపంతులు’ (Badi Panthulu) (30-11-1972) వర్కింగ్‌ స్టిల్‌ ఇది. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్‌.పంతులు నిర్మించి విజయం సాధించిన ‘స్కూల్‌ మాస్టర్‌’ (School Master) చిత్రానికి రీమేక్‌. ఎన్‌.టి.ఆర్‌ (NTR), అంజలీదేవి (Anjali Devi) ప్రధాన భూమికలు పోషించారు. లోకంలో ఎవరైనా డబ్బు, భూములు, పశువులను పంచుకుంటారు కానీ బిడ్డలు తల్లితండ్రుల్ని పంచుకోవడమనే అంశాన్ని ఆర్ధ్రంగా తెరకెక్కించిన చిత్రం ఇది. బీటలువారిన కుటుంబ సంబంధాలతో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసిన ఈ చిత్రంలో ఎన్‌.టి.రామారావు బడిపంతులు రాఘవరావుగా జీవించి, నటనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ముఖ్యంగా భార్య తనకు రాసిన ఉత్తరం చదవాలనే తహతహలో కళ్లద్దాలు పగిలిపోతే ఆ పగిలిన అద్దంతోనే ఎన్‌.టి.ఆర్‌. ఉత్తరం చదివే సన్నివేశం నాటి మహిళా ప్రేక్షకుల్ని కదిలించి, మళ్లీ మళ్లీ సినిమా చూసేలా చేసింది. ఈ చిత్రంలోని నటనకు ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని ఆ తర్వాత జెమినీ గణేశన్‌, షావుకారు జానకి ప్రధాన ప్రాతలుగా తమిళంలో తీశారు. ‘భీష్మ’ (1962) తర్వాత పదేళ్లకు ఎన్‌.టి.రామారావు పూర్తిస్థాయి వృద్ధుడి పాత్రలో కన్పించిన చిత్రం ‘బడిపంతులు’.

Updated Date - 2023-02-05T10:38:35+05:30 IST