Ntr 30: టైటిల్ ఖరారు!
ABN , First Publish Date - 2023-05-19T19:17:52+05:30 IST
ఎన్టీఆర్ 30 (Ntr 30) చిత్రం ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ (Title launch) రానే వచ్చింది.

ఎన్టీఆర్ 30 (Ntr 30) చిత్రం ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ (Title launch) రానే వచ్చింది. ఈ చిత్రానికి ‘దేవర’ (Devara) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం తారక్ పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం రాత్రి చిత్రంలోని తారక్ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘దేవర’ టైటిల్‌ను ఖరారు చేశారు.
సముద్రపు అంచున రక్తంతో ఉన్న కత్తిని పట్టుకుని, రౌద్రంగా చూస్తున్న తారక్ లుక్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సీరియస్ లుక్‌లో కూడా స్టైలిష్‌గా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ (koratala shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ (NTr) సరసన జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్ప్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకుడు.