Jr Ntr: టాలీవుడ్‌ నుంచి ఏకైక హీరో!

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:06 PM

'ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు జూ.ఎన్టీఆర్‌(jr Ntr). తాజాగా ఆయన మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను ‘ఏషియన్‌ వీక్లీ’ (Asian weekly)మ్యాగజైన్‌ ప్రకటించింది.

Jr Ntr: టాలీవుడ్‌ నుంచి ఏకైక హీరో!

'ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు జూ.ఎన్టీఆర్‌(jr Ntr). తాజాగా ఆయన మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను ‘ఏషియన్‌ వీక్లీ’ (Asian weekly)మ్యాగజైన్‌ ప్రకటించింది. అందులో ఎన్టీఆర్‌ స్థానం దక్కించుకున్నారు. ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరిట ఈ జాబితాను వెల్లడించగా ఎన్టీఆర్‌ 25వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు  ఇండస్ట్రీ  నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో తారక్‌ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్‌లో షారుక్‌ మొదటి స్థానంలో నిలవగా.. పలువురు బాలీవుడ్‌ నటీనటులు చోటు దక్కించుకున్నారు. ఇటీవల అమెరికన్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ప్రకటించిన 500 మంది అత్యంత ప్రధానమైన వ్యక్తుల జాబితాలో ఎన్టీఆర్‌, రాజమౌళి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే!

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’లో (Devara) నటిస్తున్నారు. పూర్తి సాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తారక్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తుండగా.. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్థ్‌ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంతోపాటు ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో ‘వార్‌2లో నటిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 03:24 PM