ChikotiPraveen: ఆర్జివీ కి చికోటి ప్రవీణ్ కి మంచి సంబంధాలు

ABN , First Publish Date - 2023-05-02T15:38:36+05:30 IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని నెలల క్రితం చికోటీ ప్రవీణ్ ఫార్మ్ హౌస్ కి వెళ్లి కొంత సమయం అక్కడ వున్నాడు. అలాగే ప్రవీణ్ ఫార్మ్ హౌస్ లో పెంచుతున్న జంతువుల గురించి మాట్లాడేడు. మరి ఇప్పుడు ప్రవీణ్ అరెస్టయితే ఆర్జీవీ ఎందుకు కిమ్మనకుండా కూర్చున్నాడు అన్న సందేహం వస్తోంది అందరికీ...

ChikotiPraveen: ఆర్జివీ కి చికోటి ప్రవీణ్ కి మంచి సంబంధాలు
RGV at Chikoti Praveen farm house

రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) ఇప్పుడు వైసీపీ (YCP) మౌత్ పీస్ లా మాట్లాడుతూ, నిజం (Nijam) అనే యూట్యూబ్ ఛానల్ మొదలెట్టి ఆ పార్టీ డిజిటల్ కంటెంట్ కి హెడ్ లాగా ప్రవర్తిస్తున్నాడు. అన్నీ నిజాలు అంటూ అబద్దాలు చెపుతున్నాడు. వై ఎస్ వివేకా (YSViveka) మర్డర్ కేసు గురించి తనకేమి తెలియకపోయినా వైసీపీ నేతలకు ఆ హత్యకి సంబంధం లేదని చెప్పడానికి తనదైన స్టైల్ లో ఎంతో తాపత్రయపడుతున్న ఆర్జీవీ మరి చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) అరెస్టు గురించి ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరం. థాయిలాండ్‌లో భారీ గ్యాంబ్లింగ్‌ రాకెట్‌లో చికోటి ప్రవీణ్‌‌ను పటాయ పోలీసులు (Pattaya Police) అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పటాయ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా చికోటీ అండ్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

rgvchikotipraveen.jpg

అయితే ఇటువంటి చికోటీ ప్రవీణ్ ని కొన్ని నెలల క్రితం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) కలిసిన మాట కూడా యధార్ధమే. అప్పుడు ప్రవీణ్ ఫార్మ్ హౌస్ (Praveen Farm House) కి వెళ్లి చాలా సేపు అక్కడే వున్నాడు వర్మ. అలాగే అప్పుడు ప్రవీణ్ తో వున్న ఫోటోస్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు వర్మ. అతని ఫార్మ్ హౌస్ గురించి, అతని ఫార్మ్ హౌస్ లో వున్న జంతువుల గురించి కూడా ఆ పోస్ట్ లో చెప్పాడు. మరి అప్పట్లో ఈ ప్రవీణ్, వర్మని ఎందుకు తన ఫార్మ్ హౌస్ కి ఆహ్వానించాడు, వర్మ ఎలా వెళ్ళాడు అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు.

rgvchikotipraveen1.jpg

వర్మ సినిమాలు అన్నీ ప్లాపులే, ఇప్పుడు ఎవరితోనూ పెద్ద సినిమాలు లేవు, అయినా వర్మ కొత్త ఆఫీస్ కడుతున్నాడు అని తెలిసింది, అంటే, మరి అతనికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని పరిశ్రమలో చాలామంది సందేహం పడుతున్నారు. అలాగే వర్మ కి, ప్రవీణ్ కి వున్న కనెక్షన్ గురించి కూడా పరిశ్రమలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. థాయిలాండ్ (Thailand) లో దొరికిన చికోటీ ప్రవీణ్ కి, వైసీపీ నేతలకి సంబంధాలు వున్నాయన్న సంగతి కూడా బయటపడుతోంది కదా. మరి వర్మ కూడా వైసీపీ మౌత్ పీస్ లాగే మాట్లాడుతున్నాడు కదా, మరి అలాంటప్పుడు అతనికి ప్రవీణ్ కి వున్న సంబంధాల గురించి అతని నిజంలో నిజం చెపుతాడా ఇప్పుడు.

Updated Date - 2023-05-02T15:38:36+05:30 IST