Extra Ordinary Man Teaser: దండాలయ్యా.. దండాలయ్యా.. మాతోనే నువ్ ఉండాలయ్యా!

ABN , First Publish Date - 2023-10-30T20:43:21+05:30 IST

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్’. కిక్, రేసుగుర్రం,టెంపర్ వంటి చిత్రాలకు కథ అందించిన రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్ర టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Extra Ordinary Man Teaser: దండాలయ్యా.. దండాలయ్యా.. మాతోనే నువ్ ఉండాలయ్యా!
Nithiin and Sreeleela

నితిన్ (Nithiin), శ్రీలీల((SreeLeela) హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్’(Extra Ordinary Man). కిక్, రేసుగుర్రం,టెంపర్ వంటి చిత్రాలకు కథ అందించిన రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ప్రస్తుతం శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిష్ జయ‌రాజ్(Harish jayraj) సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట, మూవీ పోస్ట‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం మేక‌ర్స్ ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో నితిన్(Nithiin) జూనియ‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని, సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన వారిలో త‌నొక ఎక్స్‌ట్రా మెంబ‌ర్‌గా ఉంటారని అర్థ‌మ‌వుతోంది. దీంతో వావ్ అనిపించేలా యాక్ష‌న్ సీన్స్ ఉన్నాయి. నితిన్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జ‌య‌రాజ్ సంగీతం ఆక్ట‌టుకుంటోంది. బాహుబ‌లి 2 ‘దండాల‌య్యా...’ పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించారు. ఇది హిలేరియ‌స్ ఉంది. శ్రీలీల‌తో హీరో ల‌వ్ ట్రాక్‌, తండ్రైన రావు ర‌మేష్‌తో హీరో నితిన్‌కి ఉండే సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ టీజ‌ర్‌లో ఉన్నాయి. వ‌క్కంతం వంశీ త‌న‌దైన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 8న రిలీజ్ అవుతుంది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని డిఫ‌రెంట్ రోల్‌తో మెప్పించ‌నున్నారు. నితిన్ త‌న‌దైన స్టైల్లో సునాయ‌సంగా త‌న పాత్ర‌ను పోషించారు. (Extra Ordinary Man Teaser)


మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిస్ జ‌య‌రాజ్ సంగీతం ఈ చిత్రాన్ని మ‌రో పెద్ద ఎసెట్‌గా నిల‌వ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన డేంజ‌ర్ పిల్ల‌.. సాంగ్‌, అందులో నితిన్‌, శ్రీలీల పెర్ఫామెన్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ అంద‌రికీ తెలిసిందే. హేరిస్ కంపోజిష‌న్ నుంచి ఔట్ స్టాండింగ్ ట్యూన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ మరియు ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-10-30T20:50:28+05:30 IST