Niharika Konidela: మొదటిసారి విడాకుల మీద స్పందించిన నిహారిక, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు
ABN , First Publish Date - 2023-07-05T13:17:24+05:30 IST
నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడాకులు కావాలని కూకట్ పల్లి ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తన విడాకుల మీద మొదటిసారిగా స్పందించిన నిహారిక ఏమన్నదీ అంటే...
మెగా కుటుంబంలో నిన్న సంచలనం రేపిన నిహారిక కొణిదెల (NiharikaKonidela) కూకట్ పల్లి ఫామిలీ కోర్టులో (FamilyCourt) విడాకుల దరఖాస్తు చేసుకోవటం అనే వార్త(NiharikaDivorce). నిన్నటి వరకు అన్ని మీడియాల్లో నిహారిక విడాకుల మీద వార్తలు వస్తూనే వున్నా, నిన్న ఆమె దరఖాస్తు చేసుకున్నాక అది అధికారికంగా ఇద్దరూ విడిపోయారు అని అన్న విషయం బయటకి తెలిసింది.
అయితే ఈ విడాకుల విషయంలో ఇటు నాగబాబు (MegaBrotherNagababu) కుటుంబం కానీ, అటు చైతన్య (ChaitanyaJonnalagadda) కుటుంబం కానీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కానీ నిహారిక మాత్రం మొట్టమొదటిసారిగా తన విడాకుల విషయంలో స్పందించింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి, (Niharika first time responds on her Divorce) ఈ విడాకుల విషయాన్నీ చెప్పి దానితో ఇక ఈ వార్తలకి ముగింపు ఇవ్వమన్నట్టుగా చెప్పింది.
"నేను, చైతన్య పరస్పర అంగీకారంతోటే విడిపోవాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది, ఆ విధంగానే ఇద్దరం ఎవరి జీవితంతో వాళ్ళు ముందుకు సాగాలని కూడా అనుకున్నాం. ఇటువంటి సమయంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ధన్యవాదములు. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే మేము ఈ కొత్త జీవితంతో ముందుకు వెళ్ళడానికి మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు," అని పోస్ట్ చేసింది.
ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నట్టుగా తెలిసింది. పెళ్లి అయ్యాక నటనకి దూరంగా వున్న నిహారిక ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సల్స్' (DeadPixels) లో నటించింది. అలాగే నిర్మాతగా కూడా మారింది.