Rana Naidu: బాబోయ్ చూడలేకపోతున్నాం... క్షమాపణ మాత్రం వారికే!
ABN , First Publish Date - 2023-03-12T18:38:42+05:30 IST
వెంకటేశ్ - రానా దగ్గుబాటి కలిసి తొలిసారి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. ఈ నెల 10న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వెంకటేశ్ (Venkatesh)- రానా (Rana) దగ్గుబాటి కలిసి తొలిసారి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana naidu). ఈ నెల 10న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ విమర్శలపాలైంది. ఫ్యామిలీ హీరోలుగా గుర్తింపు పొందిన వెంకటేశ్, రానా ఇలాంటి సిరీస్ చేయడమేంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందని పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఇమేజ్‌ని పక్కన పెట్టి వెంకటేశ్, రానా ఇలాంటి సిరీస్‌లో నటించడాన్ని నెటిజన్లు, అభిమానులు తప్పుబడుతున్నారు. రానా- వెంకీ నుంచి ఇలాంటిది ఊహించలేదని.. కుటుంబ సభ్యులతో కలిసి సిరీస్‌ను చూడలేకపోతున్నామని.. ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. (Trolling on Rana naidu) దీనికి రానా స్పందించారు. చక్కని క్రైమ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందంటూనే ఈ సిరీస్‌ను అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణ చెప్పారు.(Rana apologies to the ones who hate) సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. (Reaction of netizens to Rana Naidu)
వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ఓ వర్గం ప్రేక్షకులు నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం సిరీస్ ట్రెండింగ్‌లో ఉందని చెబుతోంది. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. ఇండియాలో టాప్ ట్రెండింగ్ షోల్లో ‘రానా నాయుడు’ మొదటిస్థానంలో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.