Rana - Meehika: రానా భార్య చేసిన పనికి నెట్టింట ప్రశంసల వర్షం.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-04-06T13:48:45+05:30 IST
టాలీవుడ్లో డిఫరెంట్‌గా కెరీర్‌ని మలుచుకుంటూ దూసుకుపోతున్న నటుల్లో రానా దగ్గబాటి (Rana Daggubati) ఒకరు.
టాలీవుడ్లో డిఫరెంట్‌గా కెరీర్‌ని మలుచుకుంటూ దూసుకుపోతున్న నటుల్లో రానా దగ్గబాటి (Rana Daggubati) ఒకరు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ప్రారంభం కాకముందే ఈ నటుడికి టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. దానికి కారణం ఆయన అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించడమే. ఇక ‘బాహుబలి’ మూవీ తర్వాత ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే.. కథ, అందులో తన పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టరైనా చేయడానికి సిద్ధమై పోతుంటాడు. ఆ తరుణంలో ‘బాహుబలి’లో విలన్‌గా, తమిళ హీరో అజిత్ చిత్రంలో ‘ఆరంభం’లో చిన్న పాత్ర చేశాడు. అలాగే.. ‘విరాట పర్వం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’లో నటించాడు.
అయితే.. కరోనా సమయంలోనే రానా తన ప్రేయసి మిహికా బజాజ్ (Meehika Bajaj) ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిహిక కూడా రానాలాగే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. ఆమె సోషల్ మీడియాలో కూడా తరుచుగా భర్తతో ఉన్న ఫొటోల పోస్టులు పెడుతూ దగ్గబాటి ఫ్యాన్స్‌ని పలకరిస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా మిహికా ఓ పని చేసి నెటిజన్ల మనసులను దొచుకుంది. ఆమెది చాలా మంచి మనసు అని మెచ్చుకుంటున్నారు.
Read Also:
Game Changer: బాబాయ్ ఛాన్స్‌ని కొట్టేసిన అబ్బాయ్.. రామ్‌చరణ్‌కి ఎవరి వల్ల సెట్ అయ్యిందంటే..
Nayanthara: తన పిల్లల పూర్తి పేర్లు చెప్పేసిన నయన్.. ఇవేం పేర్లంటూ..
మిహిక ఎప్పటి నుంచో ఎర్త్ యాంగిల్స్ (Earthangels Welfare Foundation) అనే ఎన్జీవో సంస్థతో కలిసి పని చేస్తోంది. ఆ ఎన్జీవో పేద ప్రజలకి ఉపయోగపడేలా పనులు చేస్తుంటుంది. తాజాగా ఆ ఎన్జీవో కలిసి దేశంలోని విద్యుత్ సౌకర్యం లేని మూరుమూల పల్లెల్లో సోలార్ లైట్లను పంపిణీ చేస్తోంది. దానికి సంబంధించిన ఓ పిక్‌ని మిహిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. (Netizens praises Rana Daggubati wife)
ఆ పోస్టుకి.. ‘ప్రపంచాన్ని మనుషులు ఉండేందుకు మంచి ప్రదేశంగా మార్చడానికి అకితమైన ఎన్జీవోనే ఎర్త్ ఎంజెల్స్ వెల్ఫేర్ ఫౌండేషన్. వారు ప్రస్తుతం ‘ఇండియాలోని గ్రామాల్లో వెలుగునింపేందుకు’ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో సోలార్ లైట్లు పంపిణి చేస్తున్నారు. మీరు కూడా మీకు తోచినంత డోనేట్ చేసి వారికి చేయూతనందించండి’ అని మిహిక రాసుకొచ్చింది. దీంతో ‘మీరు చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (Rana Daggubati wife Meehika Bajaj)
ఇవి కూడా చదవండి:
YRF: హాలీవుడ్‌ని ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకుంటే చూడాలని..
Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..
Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?