Neha Shetty : నన్ను నమ్మడానికి అంత సమస్య ఏంటి?
ABN , First Publish Date - 2023-09-24T10:21:50+05:30 IST
‘ఎందుకు టిల్లూ... నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్ నీకు’ ఈ ఒక్క డైలాగ్‌తో కుర్రాళ్ల గుండెల్లో డీజేలు మోగించింది నేహా శెట్టి. ‘మెహబూబా’తో తెలుగు తెరకు పరిచయమై ‘డీజే టిల్లు’లో రాధికగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
‘ఎందుకు టిల్లూ... నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్ నీకు’ ఈ ఒక్క డైలాగ్‌తో కుర్రాళ్ల గుండెల్లో డీజేలు మోగించింది నేహా శెట్టి. ‘మెహబూబా’తో తెలుగు తెరకు పరిచయమై ‘డీజే టిల్లు’లో రాధికగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇటీవల ‘బెదురులంక 2012’తో మెప్పించిన ఈ కన్నడ భామ తాజాగా ‘రూల్స్ రంజన్’తో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ముచ్చట్లివి...
సినిమా అనే ఫిక్సయ్యా...
చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. నాలుగో తరగతి నుంచే ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టా. కాలేజీలో చదువుకుంటూనే మోడలింగ్ చేసేదాన్ని. ‘మిస్ మంగుళూరు- 2014’ కిరీటాన్ని దక్కించుకున్నా. ఆ తర్వాత ఏడాదే ‘మిస్ సౌత్ ఇండియా’ మొదటి రన్నరప్‌గా నిలిచా. వెంటనే ‘ముంగారు మలే2’ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి పిలుపురావడంతో ‘మెహబూబా’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. దాని తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి నటనలో మెలకువలు నేర్చుకునేందుకు యూఎస్‌లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరా. అక్కడి నుంచి తిరిగొచ్చాక ‘గల్లీ రౌడీ’, ‘డీజే టిల్లు’లో నటించా.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా...
ఒక్కో వయసులో ఒక్కో రకమైన స్టయిల్‌ని ఫాలో అవుతా. కాలేజీ రోజుల్లో అయితే బొట్టు, పెద్ద పెద్ద చెవి కమ్మలు, కుర్తీ, చుడీదార్లే నా ప్రధాన అలంకరణ. మోడ్రన్‌గా కన్నా సంప్రదాయబద్ధంగా కనిపించేందుకే ఆ రోజుల్లో ఎక్కువ ఇష్టపడేదాన్ని. అప్పట్లో రెండేళ్లపాటు అస్సలు జీన్స్ కూడా వేసుకోలేదంటే నమ్ముతారా? ఇక ఇప్పుడైతే చీరలే నా మొదటి ఛాయిస్.
వారిద్దర్నీ అనుకరిస్తూ పెరిగా...
అల్లు అర్జున్‌తో కలిసి ఇదివరకు ఓ యాడ్‌లో నటించా. కానీ వెండితెరపై ఆయన పక్కన నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ సూపర్బ్. హీరోయిన్లలో అనుష్కశెట్టి నా ఫేవరెట్. నటనలో నాకు స్ఫూర్తి అంటే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు. చిన్నప్పటి నుంచి వారిద్దరి నటన, డ్యాన్స్‌ని అనుకరిస్తూ పెరిగా.
హైపర్ యాక్టివ్‌ని...
చిన్నప్పటి నుంచి నేను హైపర్ యాక్టివ్. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతా. స్పైసీ ఫుడ్ అస్సలు ముట్టుకోను. ముద్దపప్పు, ఆవకాయ అన్నం ఇష్టంగా లాగించేస్తా.
స్పెషల్ సాంగ్‌కి రెడీ
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు తెగ చూస్తుంటా. హార్రర్ సినిమాలంటే మాత్రం చచ్చేంత భయం. కామెడీ జోనర్ చూసేది కూడా తక్కువే. నిజానికి నా పెదాలపై చిరునవ్వు తెప్పించడం అంత సులువేమీ కాదు. కానీ ‘డీజే టిల్లు’ కథ విన్నప్పుడు మాత్రం పడిపడి నవ్వాను. నేనే ఇంతలా నవ్వానంటే, ప్రేక్షకులు కచ్చితంగా కడుపుబ్బా నవ్వుతారని ఆ రోజే ఫిక్సయ్యా. ఎక్కడికి వెళ్లినా నన్ను ‘రాధిక’ అనే పిలుస్తుంటారు. ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడడానికైనా రెడీ. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లో నటిస్తే తెలియని కిక్కు ఉంటుంది. అందుకే అగ్ర హీరోయిన్లు సైతం వాటివైపు మొగ్గుచూపుతుంటారు.
మూడు నెలల్లో తెలుగు నేర్చుకున్నా..
తెలుగు నేర్చుకునేందుకు రోజూ కనీసం రెండు మూడు తెలుగు సినిమాలు చూసేదాన్ని. అలా మూడు నెలల్లోనే తెలుగుపై పట్టు సాధించా. మా అమ్మది కూర్గ్. నాన్నది మంగుళూరు కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాట్లాడే కొడగు, తుళు భాషలు వచ్చు. కర్ణాటకలో పుట్టి పెరగడంతో కన్నడ భాషపై పట్టుంది. హిందీ, ఇంగ్లీషు ఎలాగూ వచ్చు. మొత్తానికి ఆరు భాషల్లో గలగలా మాట్లాడత