Neha shetty: ఇప్పుడే స్టార్ట్‌ చేశా.. సాధించాల్సింది చాలా ఉంది!

ABN , First Publish Date - 2023-07-21T18:37:20+05:30 IST

డీజే టిల్లు’ చిత్రంలో రాధిక పాత్రతో ఆకట్టుకొంది బెంగళూరు బ్యూటీ నేహాశెట్టి. ప్రస్తుతం ‘బెదురులంక 2012’, ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఆమె ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు ఇందులో భాగంగా ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Neha shetty: ఇప్పుడే స్టార్ట్‌ చేశా.. సాధించాల్సింది చాలా ఉంది!

‘డీజే టిల్లు’ (DJ Tillu) చిత్రంలో రాధిక పాత్రతో ఆకట్టుకొంది బెంగళూరు బ్యూటీ నేహాశెట్టి. ప్రస్తుతం ‘బెదురులంక 2012’(Beduru lanka2012), ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఆమె ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు ఇందులో భాగంగా ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘మీ హిట్‌ చిత్రం డీజే టిల్లు’లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటని’ ప్రశ్నించగా... ‘నేను అలా చెప్పలేను.

అసలు దీనికి ఎప్పటికీ సమాధానం చెప్పలేను. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ నాకెంతో ఇష్టం. సినిమా చూసి ఎన్నోసార్లు నవ్వుకుంటా. టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆచితుచి కథలు ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొస్తాయి’’ అని చెప్పారు.

మరో తుంటరి నెటిజన్‌ మీ రిటైర్‌మెంట్‌ ఎప్పుడు అని ప్రశ్నించగా... కెరీర్‌ ఇప్పుడే ప్రారంభించా. ఇంకా ఎంతో లైఫ్‌ ఉంది. చాలా ఎఛీవ్‌ చేయాలి. ‘ఏ మీకు అప్పుడే బోర్‌ కొట్టేశానా? అంటూ చమత్కరించింది. కార్‌ డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టమని, తనొక మంచి డ్రైవర్‌, నూయార్క్‌లో విహారం అంటే చాలా ఇష్టమని నేహాశెట్టి పేర్కొన్నారు. త్వరలో తమిళ చిత్రం చేయబోతున్నా. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని నేహా అన్నారు.

Updated Date - 2023-07-21T18:41:28+05:30 IST