Neethone Nenu: టీచ‌ర్స్‌పై సినిమా చేస్తున్నారేంటి? అని అడిగారట!

ABN , First Publish Date - 2023-10-11T18:39:27+05:30 IST

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’. అక్టోబ‌ర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు చిత్ర యూనిట్ పాటు పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Neethone Nenu: టీచ‌ర్స్‌పై సినిమా చేస్తున్నారేంటి? అని అడిగారట!
Neethone Nenu Movie Still

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Sri Mamidi Entertainments) బ్యాన‌ర్‌పై అంజిరామ్ (Anji Ram) ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి (M Sudhakar Reddy) నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’ (Neethone Nenu Movie). అక్టోబ‌ర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు చిత్ర యూనిట్ పాటు పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రాయటానికి డిసెంబర్ నుంచి మే వరకు ఎంటైర్ టీమ్‌తో క‌లిసి డిస్క‌ష‌న్ చేసుకుంటూ వ‌చ్చాను. మే నెల‌లో క‌థ పూర్తి కాగానే షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. కేవ‌లం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. టీచ‌ర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి? అని ఈ జ‌ర్నీలో న‌న్ను చాలా మంది అడిగారు. అంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద‌, నా క‌థ మీద‌, నా టీమ్ మీద‌, నా మీద నాకు ఉన్న న‌మ్మ‌కంతో ముందుకు అడుగులు వేస్తూ వ‌చ్చాను. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను. మంచి సినిమా చూశామని ప్రతి ఒక్కరూ చెబుతారని తెలిపారు. (Neethone Nenu Movie Ready to Release)


Neethone-Nenu-Pre-Release-E.jpg

ద‌ర్శ‌కుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించ‌టం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెల‌ల పాటు ఎంటైర్ టీమ్ క‌ష్ట‌ప‌డింది. అందువ‌ల్లే సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యాం. మా సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌గారు ఈ జ‌ర్నీలో అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. యాక్ట‌ర్స్‌ హీరో వికాస్ వశిష్ట‌, మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు, ఆకెళ్ల స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఇక నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు న‌డిపించారు. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న డెడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు. కిర‌ణ్‌గారికి, తేజ‌గారికి, ఎడిట‌ర్ ప్ర‌తాప్ స‌హా టీమ్‌కి థాంక్స్‌. అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం’’ అన్నారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎమ్. ప్రభాకర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ వంటి వారంతా.. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (Neethone Nenu Pre Release Event)


ఇవి కూడా చదవండి:

============================

*University: ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’కి అంతా క్లియర్.. ప్రముఖులకు ప్రివ్యూ

**********************************

*Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది

**********************************

*Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..

***********************************

*Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..

************************************

Updated Date - 2023-10-11T18:39:55+05:30 IST