Nayanthara: ఉదార హృదయం.. అభిమానుల ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-04-09T13:27:04+05:30 IST

నయనతార తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. ఇళ్లు లేక రోడ్లపైనే జీవనం సాగించే నిరుపేదలకు తన వంతు సాయం చేయాలని భావించారు.

Nayanthara: ఉదార హృదయం.. అభిమానుల ప్రశంసలు!

నయనతార (Nayanathara) తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. ఇళ్లు లేక రోడ్లపైనే జీవనం సాగించే నిరుపేదలకు తన వంతు సాయం చేయాలని భావించారు. తమిళనాడులో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జీవనోపాధి లేక నిరుపేదల ఇబ్బంది పడుతున్నారు. అది చూసిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మనసు చలించిపోయింది. తన వంతుగా వారికి సాయం (Vignesh shivan) చేయాలనుకున్నారు. శనివారం రాత్ని తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి నిరాశ్రయులకు భోజనం (Nayanathara helps poor peolple) అందించారు. చెన్నైలో ప్రధాన రహదారిపై జీవిస్తున్న వారి కడుపు నిండేలా భోజనం ప్యాకెట్‌లను అందజేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నయన్‌ చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఉదార హృదయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘సంపాదించడమే కాదు.. పెట్టే గుణం కూడా ఉండాలి’.. ఆ మనసు నయన్‌కు ఉంది అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో పేదలకు సాయం చేసిన సంగతి తెలిసిందే! జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని పేదలకు గిఫ్ట్‌ బాక్సులు, బట్టలు అందించించారు. (Nayanathara)

గతేడాది తెలుగులో గాడ్‌ఫాదర్‌ చిత్రంతో అలరించిన నయన్‌ ప్రస్తుతం హిందీలో జవాన్‌, తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. నయన్‌ 75వ (nayanathara 75) చిత్రానికి నిలేశ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జై ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నయన్‌, జైల కాంబినేషన్‌లో పదేళ్ల తర్వాత వస్తున్న చిత్రమిది.

Updated Date - 2023-04-09T13:41:38+05:30 IST