Nawazuddin Siddiqui - Alia: బయటకు గెంటేశాడు.. ఇది దారుణం!
ABN , First Publish Date - 2023-03-04T10:22:22+05:30 IST
బాలీవుడ్ పెయిర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియా మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆలియా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
బాలీవుడ్ పెయిర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui ), ఆయన భార్య ఆలియా(Alia) మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆలియా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరో వీడియో షేర్ చేసిందామె. ‘‘నా భర్త, నన్ను, నా పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు’ అని ఆరోపించారు. గుమ్మం ముందు సెక్యూరిటీని పెట్టి మరీ తమను లోనికి అనుమతించలేదంటూ ఆమె ఇన్స్ట్టాగ్రాంలో వరుస వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. పోలీసు అధికారులు పిలిచారని వెర్సోవా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లొచ్చేలోపు ఈ పరిణామం చోటు చేసుకుందని ఆలియా పేర్కొన్నారు. (Aaliya Fight again with her husbend)
అయితే ఆలియా ఆరోపణల్ని నవాజుద్దీన్ సిద్దీఖి ఖండించారు. ‘‘ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు నా తల్లి పేర ఉంది. దానిపై నాకు ఎలాంటి హక్కు లేదు. 2016లో ఆలియా కోసం ముంబైలో ఓ ఇల్లు కొన్నాను. తను ఆ ఇంటిని ఇష్టారాజ్యంగా అద్దెకు ఇచ్చేసింది. ఆ ఇంటి నుంచి తనను, పిల్లల్ని ఎవరూ బయటకు గెంటలేరు’’ అని పేర్కొన్నారు. (Nawazuddin Siddiqui Reacts to Aaliya’s Claims)
వీరిద్దరి ఈ వివాదం ఫిబ్రవరిలో ముంబై హైకోర్టులో విచారణకు రాగా.. పిల్లలు ఇద్దరు మైనర్లు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. మరోవైపు.. సిద్దీఖి తన పిల్లల ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషను దాఖలు చేశారు. Nawazuddin Siddiqui