National Awards Photo Gallery: జాతీయ అవార్డు గ్రహీతల సందడి, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-10-18T11:55:33+05:30 IST

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు అందచేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల ఫోటోలు వారు చేసిన సందడి

National Awards Photo Gallery: జాతీయ అవార్డు గ్రహీతల సందడి, ఫోటోస్ వైరల్
Wahida Rehman receives the prestigious Dadasaheb Phalke Award from President Draupadi Murmu

Nationalaward11.jpg

అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. ఇలా ఉత్తమ నటుడిగా ఒక తెలుగు నటుడు అందుకోవటం ఈ జాతీయ అవార్డు పురస్కారాల్లో ఇదే మొదటి సారి. అతను 'పుష్ప' సినిమాలో చేసిన నటనకి గాను ఈ అవార్డు అందుకున్నారు.


Nationalaward12.jpg

మంగళవారం జాతీ అవార్డు పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DroupadiMurmu) అవార్డు గ్రహీతలకు అందచేశారు. ఇది ఒక పండగలా నిన్న జరిగింది. ఈసారి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి చాలామంది జాతీ అవార్డు గ్రహీతల్లో ఉండటం విశేషం. అల్లు అర్జున్ (AlluArjun), రాజమౌళి (SSRajamouli), సంగీత దర్శకులు కీరవాణి (MMKeeravani), దేవి శ్రీ ప్రసాద్ (DeviSriPrasad), పాటల రచయిత చంద్రబోస్ (Chandrabhose), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, 'ఉప్పెన' #Uppena నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఇలా చాలామంది వున్నారు. అవార్డుల పురస్కారం అయిన తరువాత తెలుగు వాళ్ళు అందరూ ఒక ఫోటోకి ఇలా పోజుచ్చారు.


Nationalaward1.jpg

Nationalaward10.jpg

ఈసారి ఇద్దరు ఉత్తమ నటిగా ఎన్నికయ్యారు. 'గంగూబాయి కతియావాడి' లో నటించి అందరినీ మెప్పించిన ఆలియా భట్ (AliaBhat)కి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అలాగే 'మిమీ' అనే సినిమాలో నటించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కృతి సనన్ (KritiSanon)కి కూడా ఉత్తమ నటి అవార్డు లభించింది.


Nationalaward3.jpg

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి వ‌హీదా రెహ‌మాన్‌కు (WaheedaRehman) దాదాసాహెబ్ ఫాల్కే (DadasahebPhalke) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా రాష్ట్రపతి అందచేశారు. ఈ అవార్డు దేశ అత్యున్న‌త సినీ పురస్కారం, ప్రతి ఏడాది సినిమా రంగంలో సేవ చేసిన ఒక అత్యుత్తమ వ్యక్తికి ఇస్తూ వుంటారు. ఈ సంవత్సరం వ‌హీదా రెహ‌మాన్‌ ఈ అవార్డు ఆదుకున్నారు.


Nationalaward5.jpg

విమెన్ పవర్ అంతా నిన్న అవార్డు ఫంక్షన్ లో కనిపించింది. ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కృతి సనన్, అలియా భట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వహీదా రెహమాన్ (WaheedaRehman), 'కాశ్మీర్ ఫైల్స్' సినిమాలో చేసిన నటనకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అదనుకున్న పల్లవి జోషి (PallaviJoshi) ఇలా ఫోటోలకి పోజిచ్చారు.


Nationalaward4.jpg

'పుష్ప' #Pushpa సినిమాలో నటించిన అల్లు అర్జున్ వుత్తమ నటుడిగా పురస్కారం అందుకుంటే, అదే చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు తీసుకున్నారు. ఈ ఇద్దరూ నిన్న అవార్డు ఫంక్షన్ లో ఒకరినొకరు కలుసుకొని తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకున్నారు.


Nationalaward8.jpg

భారతదేశ ప్రథమ పౌరుడు ఎవరు అంటే భారత రాష్ట్రపతి, అంటే భారత దేశ అత్యున్నత పదవి కూడా అదే. అటువంటి పదవిలో ఒక మహిళ అయిన ద్రౌపది ముర్ము ఉండటం దేశానికే గర్వకారణం. నిన్న జాతీయ చలన చిత్ర పురస్కారాలు సందర్భంగా రాష్ట్రపతితో అవార్డులు అందుకున్న మహిళలు శ్రేయ ఘోషల్, పల్లవి జోషి, వహీదా రెహమాన్, అలియా భట్, కృతి సనన్.


Nationalaward6.jpg

జాతీయ పురస్కారాలు అందుకున్న అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి.


Nationalaward7.jpg

ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అదనుకున్న శ్రేయ ఘోషాల్ (మాయావా ఛాయావా - ఇర్విన్ నిజాల్). నిన్న ఆమె ఒక స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే చీర కట్టుకొని వచ్చి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసినట్టుగా కనిపించారు. ఇది ఆమెకి అయిదవ జాతీయ పురస్కారం. ఆమె చక్కని చిరునవ్వుతో రాష్ట్రపతి నుండి ఈ అవార్డు స్వీకరించారు.


Nationalaward2.jpg

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ మాధవన్ (RMadhavan) దర్శకత్వం వహించి, నటించిన హిందీ చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఇది. జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. అందుకని రాష్ట్రపతి నుండి పురస్కార అవార్డు అందుకుంటున్న మాధవన్.

Updated Date - 2023-10-18T11:55:33+05:30 IST