Narasimha Nandi: మరో ఆసక్తికర టైటిల్‌తో నరసింహ నంది చిత్రం..
ABN , First Publish Date - 2023-10-25T14:01:58+05:30 IST
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా, జాతీయ రహదారి’ వంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా చేయబోతున్నారు. అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఆయన నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా, జాతీయ రహదారి’ వంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది (Narasimha Nandi).. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా చేయబోతున్నారు. అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఈ దర్శకుడి నుంచి రాబోయే చిత్రానికి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ (Prabhutva Saarayi Dukanam) అనే ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మధ్య మద్యం గురించి ముఖ్యంగా ఏపీలో ఏ విధంగా వినబడుతుందో తెలియంది కాదు. ఏపీలో ఉన్న బ్రాండ్లపై పెద్ద దుమారమే రేగుతోంది. అలాంటిది ఇప్పుడు నరసింహ నంది ప్రకటించిన టైటిల్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అలా అని ఇదేదో ఏపీని టార్గెట్ చేస్తూ చిత్రమనుకుంటే పొరపాటే అవుతుంది. శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై తెరకెక్కనున్న ఈ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాని బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ సినిమా గురించి నరసింహ నంది మాట్లాడుతూ.. షేక్‌స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా.. పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా కథను తయారు చేయడం జరిగింది. 1980 నాటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను మలచడం జరిగిందని తెలిపారు. (Narasimha Nandi About Prabhutva Saarayi Dukanam)
అదితి మైఖేల్ (Adithi Myakal), వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ ఇలా పాత, కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ నరసింహ సినిమా బ్యానర్‌పై పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ నిర్మిస్తున్నారు. సుక్కు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..
***************************************
*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!
**************************************
*Bubblegum: రోషన్ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..
********************************
*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?
**********************************